ETV Bharat / state

హీరో హీరోయిన్లను విడదీస్తావా? - 'లవ్​ రెడ్డి' నటుడిపై మహిళ దాడి - వైరల్ అవుతున్న వీడియో - WOMAN ATTACK ON LOVER REDDY ACTOR

లవ్​ రెడ్డి చిత్రాన్ని చూసి భావోద్వేగానికి గురైన మహిళ - చిత్రంలో నటించిన ఎన్టీ రామస్వామిపై దాడి - ప్రేమజంటను విడదీస్తావా అంటూ రామస్వామిపై దాడి

LOVE REDDY MOVIE ACTOR ATTACK
Woman Attack on Love Reddy Actor in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2024, 10:39 PM IST

Updated : Oct 25, 2024, 8:01 AM IST

Woman Attack on Love Reddy Actor in Hyderabad : ఇటీవల విడుదలైన లవ్ రెడ్డి చిత్ర బృందానికి ఇవాళ అనూహ్య స్పందన ఎదురైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్ చూసేందుకు ఇవాళ హైదరాబాద్ నిజాంపేట్​లోని ఓ మల్టీప్లెక్స్​కు వెళ్లారు. చిత్రం అనంతరం మూవీ టీమ్ ప్రేక్షకులతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఓ మహిళ చిత్రంలో నటించిన నటుడు ఎన్టీ రామస్వామిపై దాడి చేసింది. లవ్ రెడ్డి చిత్ర పతాక సన్నివేశాలు చూసి భావోద్వేగానికి గురైన ఆ మహిళ ప్రేమజంటను విడదీస్తావా అంటూ కోపంతో రామస్వామి కాలర్ పట్టుకొని దుర్భాషలాడింది.

నిర్ఘాంతపోయిన చిత్ర బృందం : అనూహ్యంగా జరిగిన ఈ దాడితో చిత్ర బృందం నిర్ఘాంతపోయింది. వెంటనే హీరో అంజన్, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి ఆ మహిళను అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐనా మరింత కోపంతో ఆ మహిళ రామస్వామిపై దాడికి దిగే ప్రయత్నం చేసింది. ఆ మహిళ వెంట వచ్చిన వారు, ఇతర ప్రేక్షకులు ఆమెకు సర్దిచెప్పడంతో శాంతించింది. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. ఈనెల 18న విడుదలైన లవ్ రెడ్డి చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా నటించారు.

స్టార్ హీరోకు చేదు అనుభవం.. చెప్పు విసిరి దాడి.. అదే కారణమా?

Last Updated : Oct 25, 2024, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.