ETV Bharat / state

మందుబాబులకు షాకుల మీద షాకులు! - నేటి సాయంత్రం నుంచి రెండు రోజులు వైన్స్​ బంద్! - Wines Shops Closed in Telangana - WINES SHOPS CLOSED IN TELANGANA

Wine Shops Close: సమ్మర్‌లో కూల్‌ కూల్​ బీర్లతో రిలాక్స్‌ అవుతున్న మందు బాబులకు మళ్లీ షాకింగ్​ న్యూస్​. రెండు రోజులపాటు వైన్స్‌, బార్‌ షాపులు మూసివేయాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Wine Shops Close
Wine Shops Close (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 11:55 AM IST

Wines Shops Closed in Telangana: మందు బాబులకు వరుస షాక్​లు తగులుతున్నాయి. మళ్లీ వైన్స్​ షాపులు మూత పడనున్నాయి. ఈ నెలలోనే రెండోసారి మద్యం షాపులు బంద్ ​కానున్నాయి. మే 13న జరిగిన లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో 2 రోజులపాటు వైన్‌ షాపులు, బార్లు మూతపడగా.. తాజాగా మరో రెండు రోజులు వైన్స్​ షాప్స్​ మూతపడనున్నాయి. మరి, ఎక్కడెక్కడ మూత పడనున్నాయి? దీనికి గల కారణాలేంటి? మళ్లీ మద్యం దుకాణాలు ఎప్పుడు తెరుస్తారు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాష్ట్రంలో మే 27న (సోమవారం) నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో వైన్స్​ షాపులు, బార్లు మూసివేయాలని ఎక్సైజ్​ శాఖ అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అన్ని వైన్స్​ షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. మే 27న పోలింగ్‌ జరగనుండగా ముందు నుంచే బంద్ పాటించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలతోపాటు అన్ని కల్లు కంపౌండ్‌లు సైతం 48 గంటల పాటు మూతపడనున్నాయి.

హైదరాబాద్‌లో తగ్గుముఖం పట్టిన రేవ్​ పార్టీలు - పోలీసుల నిరంతర నిఘాతో బెంగళూరుకు షిఫ్ట్​! - Police Focus on Drugs Parties

ఆ మూడు జిల్లాల్లోనే : మే 25వ తేదీన శనివారం సాయంత్రం 4 గంటల నుంచి మూసివేత నిర్ణయం అమలు కానుంది. తిరిగి మే 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు మద్యం షాపులు ఓపెన్​ కానున్నాయి. అయితే ఈ బంద్ రాష్ట్రం మొత్తం కాదు. ఎన్నికలు జరుగుతున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని వైన్‌ షాపులను మాత్రమే బంద్‌ చేయనున్నారు. ఆ జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్​ రోజైన జూన్​ 4న కూడా మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.

వరుస బంద్​లు.. మందు బాబులకు వరుస బంద్​లు షాకిస్తున్నాయి. ఏప్రిల్​ నెలలో శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసేశారు. మే నెలలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరుసగా రెండు రోజులు మూత పడ్డాయి. మళ్లీ ఇప్పుడు మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు బంద్​ కానున్నాయి. అటు జూన్​ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్​ రోజున కూడా మూసివేయనున్నారు. ఇలా వరుసగా షాకుల మీద షాకులు తగులుతుండడంతో మద్యం ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - ఈ నెల 27న వారికి ప్రత్యేక క్యాజువల్​ లీవ్ - Casual leave on MLC Elections

బెంగళూరు రేవ్‌ పార్టీ అప్​డేట్ - 103 మందిలో తెలుగు నటి సహా 86 మందికి డ్రగ్‌ పాజిటివ్‌ - BANGALORE RAVE PARTY DRUG TESTS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.