Wine Shops Closes in Telangana On June 4th : మందుబాబులకు ఒక్కరోజు చుక్క లేకపోయినా ఏదో కోల్పోయినట్లే అనిపిస్తుంది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం వారికి భారీ షాక్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మంగళవారం రోజున (జూన్ 4వ తేదీ) ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కంగుతిన్న మందు బాబులు ముందుగానే అలర్ట్ అయ్యారు.
మమ్మల్ని ఎవరూ ఆపలేరు అంటూ అందుకే జీవితంలో ముందుచూపు ఎంత అవసరమో మందుచూపు అంతకన్నా ఎక్కువ అవసరం అనుకుని ముందుగానే తమకు కావలసినంత సరకు తీసుకొచ్చేయాలని నిర్ణయించుకుని మద్యం దుకాణాలు వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే వారికి అక్కడ మరో ఊహించని పరిస్థితి ఎదురైంది. ఒక గూటి పక్షులు అన్నీ ఒక దగ్గరకి చేరినట్లు అప్పటికే అక్కడ భారీగా తమ లాంటి వారే ఉండటం చూసి షాక్ అయ్యారు.
చుక్క మందు కోసం గంటల తరబడి పడరాని పాట్లు పడుతూ క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. చేసేదేం ఉంది అనుకుంటూ, ఎంత భారీగా లైన్లు ఉన్నా సరే బ్రో మీ బ్రాండ్ ఏంటి అంటే మీ బ్రాండ్ ఏంటి అంటూ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ముందుకు కదలుతున్నారు. ఎంతో సమయం వేచి ఉన్న తరువాత, తమకు కావలసినంత సరకు రావడంతో, జీవితంలో గొప్ప విజయం సాధించామంటూ సంతోషపడి ఇంటి బాట పడుతున్నారు.
అలర్ట్ : మద్యం ప్రియులపై మరో బాంబు - మళ్లీ వైన్స్ బంద్! - Wine Shops Closes in Telangana
LIQUOR DRY DAY IN Telangana : రాష్ట్రంలో మద్యం షాపులు మంగళవారం ఉదయం ఆరు గంటలకే మూతపడనున్నాయి. ఓట్ల లెక్కింపు ముగిసేంత వరకు తెరచుకోవు. ఆ రోజు ‘డ్రై డే’గా పరిగణించాలని ప్రభుత్వం పేర్కొంది. ఫలితాల తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే కొంతకాలంగా మందు బాబులకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. పలు కారణాలతో మద్యం దుకాణాల మూసివేత కొనసాగుతోంది. బార్లు, మద్యం షాపులు మూతపడనున్నాయని తెలియడంతో ఈసారి మందుబాబులు ముందుగానే జాగ్రత్తపడ్డారు.
Huge Crowd at Wine Shops : రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాల వద్ద మందు ప్రియులు బారులు తీరారు. మంగళవారం మద్యం దుకాణాలు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. తిరిగి బుధవారం ఉదయం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. దీంతో ముందుగానే మద్యం సీసాలు విక్రయించి తమ ఇళ్ల వద్ద స్టాక్ పెట్టుకునేందుకు దుకాణాల వద్ద మందుబాబులు ఎగబడుతున్నారు.
మందు బాబులకు భారీ షాక్ - మూడు రోజులు వైన్స్ బంద్! - Wine Shops Close For 3 Days