Wine Shops Closed for Election in Telangana : పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో 48 గంటలపాటు మద్యం అమ్మకాలను నిలిపివేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. మద్యం దుకాణాలతో పాటు బార్లు, క్లబ్‌లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, మద్యం డిపోలు మూసివేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ఎక్కడైనా పోలింగ్ ముగియనట్లయితే అక్కడ మాత్రం పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్‌లో ఉంటాయని వివరించింది.
రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరా, గుడుంబా, గంజాయి తదితర తయారీ, సరఫరా, అమ్మకాలపై అబ్కారీ శాఖ నిఘా పెట్టింది. రాష్ట్రంలోని 139 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 139 ప్రత్యేక బృందాలు, 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక బృందాలు, 34 జిల్లా టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాలు, 4 రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందాలు నిరంతరం పెట్రోలింగ్ చేస్తాయని అబ్కారీ శాఖ అధికారులు వివరించారు.
అక్రమ మద్యం, ఇతర మత్తుపదార్ధాలపై నిఘా : బయట రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం, ఇతర మత్తుపదార్ధాలు సరఫరా కాకుండా నిలువరించేందుకు 21 ప్రాంతాలల్లో సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యేక బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మద్యం సరఫరా కాకుండా చూడడంతో పాటు బయట ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం, గుడుంబా, లాంటి ఏవీ కూడా సరఫరా కాకుండా చూస్తాయని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లోని తనిఖీ కేంద్రాలు 24 గంటలు పని చేస్తాయని అబ్కారీ శాఖ అధికారులు వివరించారు.
మద్యం డ్రై డేను కచ్చితంగా అమలు : మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఈ నెల 10న ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు రోజు కూడా మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టం చేశారు. కచ్చితంగా వైన్ డ్రై డేను అమలు చేయాలని ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు సీఈవో స్పష్టం చేశారు.
సాయంత్రం వరకే ఛాన్స్ - నేటి నుంచి 2 రోజులు వైన్స్ బంద్! - Wine Shops Close in Telangana
మందు బాబులకు డబుల్ షాక్ - ఈ సారి వరుసగా 2 రోజులు వైన్స్ బంద్! - WINE SHOPS CLOSE IN TELANGANA