ETV Bharat / state

దసరా వేళ మందుబాబులకు బిగ్​ షాక్​ - రెండు రోజుల పాటు వైన్స్​ బంద్​

దసరా వేళ మందుబాబులకు చుక్కెదురు - ఆ జిల్లా ప్రజలకు చేదు వార్త - రెండు రోజులపాటు వైన్స్​ బంద్​

Wine Shops Close in Nirmal District
Wine Shops Close in Nirmal District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 7:50 PM IST

Updated : Oct 11, 2024, 10:11 PM IST

Wine Shops Close in Nirmal District : రాష్ట్రవ్యాప్తంగా దసరా సంబురాల వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గతరాత్రి సద్దుల బతుకమ్మ పూలపండుగ సందడిగా సాగగా, శనివారం విజయ దశమి ఘనంగా జరగనుంది. రాష్ట్రంలో దసరా పండుగ అంటే కచ్చితంగా మందు, మాసం ఉండాల్సిందే. సుక్క లేనిదే వేడుకకు కిక్కు ఉండదు. కానీ ఆ జిల్లాలో పోలీస్, ఎక్సైజ్ శాఖా అధికారులు వారికి కిక్కు దించే సమాచారం అందించారు. దసరా పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో 2 రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా పోలీస్, ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

నిర్మల్, ముధోల్​లో 12 వ తేదీ (శనివారం) ,13 వ తేదీ (ఆదివారం) భైంసాలో దుర్గాదేవి నిమజ్జనం, రావణ దహనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి 14 వ తేదీ ఉదయం వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. గత వినాయక నవరాత్రి ఉత్సవాల్లో తలెత్తిన అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకొని మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, శాంతి భద్రతల పరిరక్షణకై ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

"దసరా అమ్మవారు నిమజ్జనం, రావణ దహనం కార్యక్రమాల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో వైన్ షాప్స్​ అన్నీ బంద్​ చేయాలని జిల్లా కలెక్టర్​ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే భైంసా పట్టణంలో రేపు ధర్మచక్రపరివర్తన నిమజ్జనం, ఆదివారం అమ్మవారి నిమజ్జనం ఉంది. అక్కడ కూడా రెండు రోజుల పాటు వైన్స్​ బంద్​ ఉంటాయి. సున్నితమైన ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పూర్తి బందోబస్తు చేశాం."-జానకి షర్మిల, ఎస్పీ

వైన్ షాప్స్ ముందు రద్దీ : అధికారుల నిర్ణయంతో మందుబాబులు నిరాశకు గురయ్యారు. పండుల సమయంలో ఇలా అకస్మాత్తుగా నిర్ణయం ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలామంది ఈ విషయం తెలియగానే వైన్ షాప్స్ ముందు బారులు తీరారు. పండుగకు కావాల్సిన మందును ముందు తీసిపెట్టుకున్నారు. దీంతో వైన్ షాప్స్ ముందు రద్దీ కనిపించింది. పలుచోట్ల అడిగిన బ్రాండ్స్ లేవని మందు బాబులు అసంతృప్తికి లోనవడం కూడా కనిపించింది. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో బీర్లలో కొన్ని బ్రాండ్ల స్టాక్ అయిపోయింది. వైన్ షాప్స్ వారు కూడా పండుగ కోసం ముందే సిద్ధమయ్యారు. కావల్సిన సరుకును ముందే తెప్పించుకున్నారు.

మద్యం టెండర్ల మహర్దశ - కిక్కెవరికో..? లక్కెవరికో?

లిక్కర్ బిజినెస్​లోకి సాఫ్ట్​వేర్లు, డాక్టర్లు - తగ్గేదే లే అంటున్నారుగా! - AP Liquor Shops Application Process

Last Updated : Oct 11, 2024, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.