ETV Bharat / state

ఆస్తి కోసం రగడ- తమ వాటా ఇవ్వాలంటూ భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య - Wife Fight for Property in Manthani

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 2:09 PM IST

Updated : Sep 9, 2024, 2:26 PM IST

Wife Fight for Property in Manthani : తన కుమారుడికి, కుటుంబ వాటాలో రావాల్సిన ఆస్తిని ఇవ్వాలంటూ మరణించిన భర్త అంత్యక్రియలను భార్య అడ్డుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. చివరకు పెద్ద మనుషులు నచ్చజెప్పడంతో రెండు రోజుల తర్వాత అంత్యక్రియలను నిర్వహించారు.

Wife Fight for Husband Property
Wife Fight for Property in Peddapalli (ETV Bharat)

Wife Fight for Husband Property : ఆస్తి కోసం దహన సంస్కారాలు ఆగిపోయిన విషాద సంఘటన మంథనిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే పెద్దపెల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. నగరానికి చెందిన సంధ్య అనే యువతితో సునీల్​కు వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గత సంవత్సర కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి గొడవలు జరగడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు.

అనారోగ్యంతో మృతి : ఈ నేపథ్యంలో మద్యానికి బానిసైన సునీల్, మూడు రోజుల క్రితం హైదరాబాద్​లో అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తల్లి, సోదరుడు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్​కు వెళ్లి ఉస్మానియా హాస్పిటల్​లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని మంథని గోదావరినది వద్దకు దహన సంస్కారాల కోసం తీసుకువచ్చారు.

ఆస్తి కోసం అంత్యక్రియల అడ్డగింత : మృతుని భార్య సంధ్య మంథనికి వచ్చి సునీల్ దహన సంస్కారాలు కాకుండా అడ్డుకుంది. తనకు ఒక కుమారుడు ఉన్నాడని, తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆస్తి వ్యవహారాల గొడవలతో దహన సంస్కారాలను అడ్డుకోవడంతో స్థానికులు, అధికారులు ఎంత నచ్చ చెప్పిన సంధ్య వారి కుటుంబ సభ్యులు వినలేదు. సుమారు రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డున సునీల్ మృతదేహంతో వారి కుటుంబ సభ్యులు దహన సంస్కారాల కోసం వేచి చూశారు.

చివరకు ఈరోజు ఉదయం గ్రామానికి చెందిన పెద్దమనుషులు నచ్చజెప్పడంతో సంధ్య తన కుమారున్ని తీసుకొని తిరిగి హైదరాబాద్​కు వెళ్లిపోయింది. మరణించిన సునీల్‌కు తన కుమారుడితో కనీసం దహన సంస్కారాలు కూడా చేయించలేదని, ఆస్తిలో వాటా కోసం రెండు రోజుల పాటు మృతదేహాన్ని దహన సంస్కారాలు కాకుండా అడ్డుకుందని తల్లిదండ్రులు ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన మృతదేహం అడ్డం పెట్టుకొని ఆస్తి కోసం కొట్లాడిన ఇలాంటి సంఘటనపై గ్రామస్తులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

కల్యాణ ఘడియల్లో కన్నీటి ఘోష - భారీగా నష్టపోయిన 'వివాహ' కుటుంబాలు - Massive Loss Due to Floods

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు - నలుగురు మృతి, ఐదుగురికి గాయాలు - Road Accident in Nalgonda

Last Updated : Sep 9, 2024, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.