ETV Bharat / state

ఆ 'జానపదం' గొల్లుమన్నది- అంతరించిపోతున్న సంప్రదాయ కళల ఉనికి - Endangered Folk Arts

What Should be Done to Safeguard Folklore : ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేవి కళలు. ప్రాచీన వారసత్వాన్ని భావితరాలకు అందించేవి కూడా కళలే. అందులోనూ జానపద కళలది విశిష్ఠ స్థానం. ప్రపంచంలోని ఏ భాషా పాండిత్యానికైనా అందులోని జానపద సాహిత్యమే మూలం అన్నది పరిశోధకుల మాట. సంగీతం, నృత్యం, అభినయం లాంటి ప్రదర్శనలన్నీ జానపద కళలే.

what_should_be_done_to_safeguard_folklore
what_should_be_done_to_safeguard_folklore (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 1:51 PM IST

What Should be Done to Safeguard Folklore : సాంస్కృతిక సంపదగా దేశ గౌరవాన్ని నిలబెట్టిన జానపద కళలు నేడు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ప్రపంచం ఆధునిక రూపు సంతరించుంటూ ఉండడం, పాతతరం కళాకారుల మరణం, కొత్త తరానికి వీటిపై అనాసక్తి. వెరసి జానపదళ కళల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గురువారం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా వీటి విశిష్ఠత సహా కాపాడేందుకు ప్రభుత్వాలు, పౌర సమాజం తీసుకోవాల్సిన చర్యలపై అవలోకనం చేసుకుందాం.

కాలక్షేపం కావాలంటే నచ్చిన సినిమాను ఇంట్లోనే ఓటీటీలో చూసుకోవడం లేదంటే స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు, ఆటలతో గడపడం. ఆధునిక తరానికి కాలక్షేపం అంటే ఇవే. కాని సాంకేతికత అందుబాటులో లేని పాతకాలంలో సమయం గడవాలంటే కళా రూపాలే ఏకైక మార్గం. నాటకాలు, తోలు బొమ్మలాటలు, ఏకపాత్రాభినయాలు, హరికథలు. ఇలా చెప్పుకుంటూ వెళితే పాతతరానికి బోలెడు కళా రూపాలు అందుబాటులో ఉండేవి. ఇందులో జానపద కళలది ప్రత్యేక స్థానం. ఒక సమూహంగా జీవించే వారి ఆటపాటలే జానపదం. సంగీతం, నృత్యం, అభినయంతో కూడిన అనేక కళారూపాలు జానపదాల సొంతం. కోలాటం, తప్పెటగుళ్లు, చెక్క భజన, పులి వేషాలు, హరిదాసు, పిట్టల దొరల ప్రదర్శనలు, సంప్రదాయ యుద్ధ కళలైన కర్రసాము, కత్తిసాము ఒకటేమిటి అనేక కళలతో జానపదం ఒకప్పుడు తరగని వైభవంతో అలరారింది. జాతి కళా, సాంస్కృతిక వైభవాన్ని ఘనంగా చాటింది. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశకు చేరుకోగా, వీటి విశిష్ఠతను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 22ను ప్రపంచ జానపద దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు.

గ్రామీణులు, గిరిజనులు కాయకష్టం తర్వాత సేద తీరడానికి, విజ్ఞానం, వినోదాన్ని ఆస్వాదించడానికి ఆవిర్భవించిన సహజ కళలే జానపదాలు. ఒక సంస్కృతి లేదా సమాజం సంప్రదాయ నమ్మకాలు, కథలు, ఆచారాలను వచ్చే తరానికి తెలపడం కూడా జానపదమే. తద్వారా ఇవి ఒక తరం నుంచి మరో తరానికి తెలియజేయడానికి మార్గదర్శకం అవుతాయి. జానపదం అంటే ఆంగ్లంలో ఫోక్‌ అని అర్థం. విలియం జాన్‌ థామ్స్‌ అనే భాషా శాస్త్రవేత్త 1846 ఆగస్టు 22న లండన్‌ పత్రికలో అథీనియం అనే వ్యాసాన్ని ప్రచురించారు. దీనిలో ఫోక్‌ అనే పదాన్ని మొదటిసారిగా ప్రస్తావించారు. దానికి గుర్తుగా అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 22ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కథలు, కళారూపాల సంస్కృతి, ప్రాముఖ్యతను తెలిపే విధంగా జానపద దినోత్సవంగా నిర్వహించుకుంటారు.

భారతదేశంలో జానపద కళల గొప్పదనం గురించి చెప్పుకోవాలంటే యక్షగానం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో గొప్ప వైభవాన్ని అనుభవించింది. తెలుగునాట తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాట, బుట్టబొమ్మలతో కూడిన బొమ్మలాట మరో ప్రాచీన కళారూపం. ఇందులో కేతిగాడు, బంగారక్క వంటి హాస్యపాత్రలు సుదీర్ఘకాలం ప్రజలను అలరించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలు కళారూపాలు ఇప్పటికీ ప్రజలకు వినోద సాధనాలుగా ఉన్నాయి. ఇక్కడ భామాకలాపాన్నితూర్పు భాగవతంగా వ్యవహరిస్తారు. తప్పెటగుళ్లు ఈ ప్రాంతంలో మరో ప్రధాన జానపద కళారూపం. జముకుల పాట కళింగాంధ్రకే ప్రత్యేకం. సంక్రాంతి రోజుల్లో దాసర్లు తంబూర, అందెలు, చిడతలు ఉపయోగించి బొబ్బిలి యుద్ధం, బాల నాగమ్మ వంటి కథలను గానం చేస్తారు.

అక్కడ గజ్జ కట్టారంటే..! జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్రొద్దుటూరు బాలికలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రోజుల్లో ప్రదర్శించే గంగిరెద్దుల ఆట ప్రధాన జానపద కళారూపం. గోదావరి జిల్లాలో గరగ నృత్యం మరో జానపద కళ. తలమీద బొమ్మలను పెట్టుకుని నృత్యం చేస్తూ కళాకారులు అమ్మవారి గుడి దగ్గరకు చేరుకుంటారు. రాయలసీమలో దీన్ని గరిగబుడ్డి అంటారు. ఈ ప్రాంతంలో జట్టి జాము, జ్యోతి నృత్యం, ఉరుముల నృత్యం వంటి భిన్నమైన కళా రూపాలు ఉన్నాయి. కోస్తా ప్రాంతంలో బుర్రకథ చాలా శక్తివంతమైన సామాజిక కళ. జానపద నృత్యకళల్లో కోలాటం ప్రసిద్ధమైనది. దేవుని వేడుకలు, జాతరలు, ఉత్సవాల్లో ఈ కళను ప్రదర్శిస్తుంటారు. ఉత్తరాంధ్రలో అమ్మవారి ఉత్సవాలంటే వెంటనే గుర్తొచ్చే సాంస్కృతిక కార్యక్రమం పులివేషం. ఈ కళను అభ్యసించేవారు, నిష్ణాతులైన వారు విజయనగరంలోనే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా పైడితల్లి అమ్మ వారి పండుగలో పులి వేషాలది అగ్రస్థానం. మూడు జిల్లాల్లో గ్రామ దేవతల పండుగలు, వినాయక చవితి, దుర్గా నవరాత్రి ఉత్సవాలు, ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక ఉత్సవాల్లో కూడా పులివేషానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది.

విజయనగరంలోని నాగవంశపు వీధి, లంకవీధి, కొత్తపేట, హుకుంపేట తదితర ప్రాంతాల నుంచే వచ్చే కళాకారులు పులివేషాలు వేసి పైడి తల్లి అమ్మవారి జాతరలో సందడి చేస్తారు. పండుగకు కళ తెస్తారు. వేషం వేసే ముందు పైడిమాంబకు పసుపు-కుంకుమలు సమర్పిస్తారు. పసుపు, కుంకుమ ఇతర పూజా సామాగ్రితో తల నుంచి కింది వరకూ తెల్లటి పంచె కప్పుకుని పైడిమాంబకు పూజ చేస్తారు. ఆ తరువాతే తొలేళ్లు, సిరిమానోత్సవం రోజున వేషం వేస్తారు. కొంతమంది భక్తులు తమకు ఏదైన కష్టం వచ్చినప్పుడు, అది తీరితే ఉత్సవాల సమయంలో పులి వేషం ధరిస్తానని మొక్కుకుంటారు. అన్నమాట ప్రకారం పులి వేషాలు ధరించి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు.

జానపద కళాకారులతో స్టేజ్​పై డ్యాన్స్​ చేసిన సీఎం

అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ప్రదర్శించే ధింసా నృత్యం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అక్షరం రాకున్నా గిరిజనులు వినసొంపుగా పాటలు ఆలపిస్తూ భుజంపై చేతులు వేసి నృత్యాలు చేస్తారు. ఎక్కడా శ్రుతి, లయలు తప్పకుండా వీరు చేసే నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. అరకు ప్రాంతాన్ని సందర్శించే పలువురు ప్రముఖులు ధింసా నృత్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రాచీనమైన ఈ నృత్యం ఇప్పటికీ అందరినీ అలరిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.