TG EAPCET First Phase Seat Allotment 2024: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్/బీఈ సీట్ల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలనతో పాటు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి జులై 19వ తేదీన సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. విద్యార్థులు తాము సీట్లు పొందిన కాలేజీ వివరాలను అధికార వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి అది ఎలా తెలుసుకోవాలి? సీట్ అలాట్‌మెంట్ తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్/బీఈ సీట్ల భర్తీకి.. జులై 4 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత ప్రక్రియ ప్రారంభం అయ్యింది. జులై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్, జులై 8 నుంచి 15 వరకు తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. తాజాగా జులై 19న ఇంజినీరింగ్ తొలి విడత సీట్లు కేటాయించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈసారి రికార్డుస్థాయిలో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే 95.60 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా కింద ఈడబ్ల్యూఎస్(EWS) సీట్లతో కలుపుకొని 78,694 సీట్లు అందుబాటులో ఉండగా.. 96,238 మంది పోటీపడ్డారు. వారిలో 75,200 అభ్యర్థులకు బీటెక్ సీట్లు దక్కాయి. ఇక మిగిలింది 3,494 మాత్రమే. సీట్లు పొందిన వారు ఈ నెల 23లోపు అలాట్‌మెంట్ లెటర్‌లో పేర్కొన్న ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, లేని పక్షంలో సీట్లు రద్దవుతాయని ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
తొలి విడత సీట్ల కేటాయింపు లెటర్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు ముందుగా అధికార వెబ్సైట్ https://eapcet.tsche.ac.in/ లాగిన్ అవ్వాలి.
- స్క్రీన్ మీద కనిపించే Admission (E, A&P) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే TG EAPCET - 2024 ఆప్షన్లో TGCHE పై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Candidate Login బటన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్‌లో Sign In అవ్వాలి. మీరు ముందే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే లాగిన్ ఐడీ, హాల్‌టికెట్ నెంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి Sign Inపై క్లిక్ చేయాలి.
- ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ కాకపోతే Candidates Registration ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత ఆ వివరాలతో సైన్ ఇన్ అవ్వాలి.
- ఆ తర్వాత మీరు సీటు పొందిన కాలేజీ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- ఆ తర్వాత ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ తర్వాత ఇదే:
- TG EAMCET 2024 ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్లో తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో సీటును అంగీకరించి, సీట్ అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- విద్యార్థుల సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న ట్యూషన్ ఫీజును TG EAPCET 2024 ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా నిర్ణీత వ్యవధిలో అంటే జులై 23వ తేదీలోపు పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ ప్రక్రియను పూర్తి చేయాలి. అభ్యర్థులు రూ.₹5000 (SC/ST), రూ.10,000(ఇతరులు) చెల్లించాలి.
- ట్యూషన్ ఫీజు చెల్లించిన అభ్యర్థులు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తమకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలి.
TG EAMCET 2024 కాలేజ్‌లో రిపోర్ట్ చేయడం కోసం అవసరమైన పత్రాలు:
- TG EAMCET 2024 అడ్మిట్ కార్డ్
- TG ఎంసెట్ 2024 స్కోర్‌కార్డ్ లేదా ర్యాంక్ కార్డ్
- ఎంసెట్ హాల్ టికెట్
- స్టూడెంట్ ఆధార్ కార్డు
- 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ ఉత్తీర్ణత సర్టిఫికెట్స్
- 10 సంవత్సరాలకు పైగా తెలంగాణలో నివసిస్తున్న తల్లిదండ్రులు నాన్-లోకల్ అభ్యర్థులకు డొమిసైల్ సర్టిఫికేట్.
- నివాస ధ్రువీకరణ పత్రం
- ఫీజు రీయింబర్స్‌మెంట్ అభ్యర్థులకు ఆదాయ ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం (if Applicable)
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
- వైకల్యం/క్రీడలు/సాయుధ సిబ్బంది (CAP)/NCC/మైనారిటీ సర్టిఫికెట్ (if Applicable)
- ఒకవేళ ఫస్ట్పేజ్లో వచ్చిన కాలేజీ లేదా బ్రాంచ్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చు.
ఇవీ చదవండి:
'స్పెషల్ స్కిల్స్' ఉంటేనే జాబ్- అభ్యర్థుల ఎంపికలో కొత్త ట్రెండ్!