ETV Bharat / state

వేసవిలో హైదరాబాద్​కు సరిపడా తాగు నీరు - నగరవాసులకు చల్లటి వార్త​ చెప్పిన జలమండలి - Drinking Water Crisis in Hyderabad

Water Board About Drinking Water Crisis in Hyderabad : వేసవిలో హైదరాబాద్ మహానగర ప్రజలకు సరిపడా తాగునీటిని అందిస్తామని జల మండలి స్పష్టం చేసింది. జలాశయాల్లో సరిపడా నిల్వలున్నాయని, నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపింది. నీటి ఎద్దడి రాబోతుందన్న ప్రచారంలో నిజం లేదని, ఒకవేళ అలాంటి పరిస్థితులే ఎదురైతే అత్యవసర పంపింగ్ వ్యవస్థను సిద్ధం చేసినట్లు జలమండలి వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో ఇక నుంచి రాత్రివేళల్లో సరఫరా చేయాలని నిర్ణయించింది.

WATER BOARD ABOUT DRINKING WATER
Water Board About Drinking Water Crisis in Hyderabad :
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 5:12 PM IST

వేసవిలో హైదరాబాద్​కు సరిపడా తాగునీరు - జలమండలి

Water Board About Drinking Water Crisis in Hyderabad : గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై జల మండలి ప్రత్యేక దృష్టి సారించింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో కోటిన్నరకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో కూడా బెంగళూరు (Bengaluru) పరిస్థితి రావొచ్చనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అప్రమత్తమైన జలమండలి వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది. నగరవాసులకు తాగునీటి కష్టాలు తలెత్తకుండా గతేడాది కంటే మరో 10 ఎంజీడీల నీటిని ఎక్కువగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రోజు విడిచి రోజు కుటుంబానికి 20 వేల లీటర్లు నీటిని సరఫరా చేస్తోంది.

డెడ్ స్టోరేజీ నుంచి నీటి తరలింపు : ఇందుకోసం ఉస్మాన్‌సాగర్ (Osman Sagar), హిమాయత్‌ సాగర్‌లతో పాటు మంజీరా, సింగూరు, కృష్ణా, గోదావరి నదుల నుంచి 600 ఎంజీడీల నీటిని వాడుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీ లెవల్‌పైన 7.06 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మరోవైపు గోదావరి జలాల కోసం ఎల్లంపల్లి జలాశయంలో డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు అత్యవసర పంపింగ్ చేయడానికి అవసరమైన ప్రక్రియ మొదలు పెట్టారు. అదే విధంగా అవసరం ఆధారంగా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్ జంట జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించేందుకు సమాయత్తమవుతోంది. ఇవే కాకుండా సింగూరు, మంజీరా జలాశయాల్లో సంతృప్తికరమైన నీటి నిల్వలు ఉన్నాయని, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదని జలమండలి చెబుతోంది.

water supply and sewerage board on drinking water : ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో నీటిని తరలించే ట్యాంకర్లకు గతంలో కంటే భారీగా డిమాండ్ పెరుగుతోంది. జలమండలిలోని 24 డివిజన్లలో పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, ఎస్సార్ నగర్​​, కూకట్‌పల్లి, మణికొండ, నిజాంపేటతో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ట్యాంకర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. గ్రేటర్ వ్యాప్తంగా 72 ఫిల్లింగ్ కేంద్రాల పరిధిలో సుమారు 650 ట్యాంకర్లు రోజూ తిరుగుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్లను సరఫరా చేయలేక జలమండలి తలపట్టుకుంటోంది. రాత్రి వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండటం, పగటిపూట వాహనాల రద్దీ కారణంగా నీటి సరఫరాలో జాప్యం జరుగుతోంది.

రాత్రి వేళల్లో నీటి సరఫరా : మరికొన్ని ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ వల్ల ట్యాంకర్ వెళ్లే వీళ్లేకపోవడంతో నీటి సరఫరాలో ఆలస్యమవుతోంది. అయితే ఇక నుంచి రాత్రి సమయాల్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిశోర్ (Dana kishore) జల మండలి అధికారులను ఆదేశించారు. సిబ్బందికి అదనపు షిఫ్టులు వేసి నగరంలో నీరు సరఫరా చేసే ఏర్పాట్లు చేయాలన్నారు. పగటి వేళల్లో గృహ అవసరాలకు, రాత్రి వేళ వాణిజ్య అవసరాలకు ట్యాంకర్లను పంపించాలని నిర్ణయించారు.

తాగునీటిని వృథా చెయొద్దు : ఒకవేళ అత్యవసర పరిస్థితిలో సొంత ట్యాంకర్ తెచ్చుకుంటే, నీళ్లు ఇవ్వాలని జలమండలి అధికారులకు దానకిశోర్‌ సూచించారు. గతేడాది మార్చిలో సరఫరా చేసిన నీరు కంటే, ఈ ఏడాది అదనంగా మరో 10 ఎంజీడీ(MGD)ల నీరు సరఫరా చేస్తున్నట్లు జలమండలి చెబుతోంది. నగర ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా, సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే నిబంధనల ప్రకారం నల్లా కనెక్షన్ తొలగింపుతో పాటు జరిమానా విధిస్తామని జలమండలి హెచ్చరిస్తోంది.

తాగునీటి ఎద్దడిపై అధికారుల ఫోకస్ - బోరుబావుల పునరుద్ధరణ - DRINKING WATER Crisis

ముఖ్యనగరాల్లో నీటి కొరత - చర్యలు చేపట్టకపోతే అంతే సంగతి - Water Crisis in India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.