BRS MLAs Walkout from Assembly : నేడు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అధికార కాంగ్రెస్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు(BRS Walkout) సభ నుంచి బయటకు వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ వైఖరిపై నిరసనగా కంచెల రాజ్యం, పోలీసుల రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నినాదాలు చేశారు.
సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు మాట్లాడడానికి సభలో అవకాశం ఇవ్వరు, మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా? అని పోలీసులను ప్రశ్నించారు. అనుమతి ఇస్తారా? కంచెలు బద్దలు కొట్టాలా? అని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగని విధంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఘాటు కామెంట్స్ - సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
Harish rao fires on Congress : ఇదేనా ప్రజాపాలన? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు(Harish rao) ఎక్స్‌వేదికగా స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదని, ప్రతిపక్షాల గొంతు అణిచివేసేందుకు ఇదంతా అధికార పక్షం చేస్తున్న కుట్ర అని దుయ్యబట్టారు.
అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు, అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరా? అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం అంటూ నినాదం చేశారు. అసెంబ్లీలో 3-4 వేల మంది పోలీసులు ఎందుకు మోహరించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇనుప కంచెలు తీసివేశామన్నారు, మళ్లీ ఇక్కడ ఆంక్షలు ఎందుకని కడియం శ్రీహరి ప్రశ్నించారు. తెలంగాణ భాషను సీఎం రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారని, సచివాలయం వెలుపల రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం ఉందని, కేసీఆర్ హయంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహాన్నే అక్కడ పెట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పొంతనలేదు : కడియం శ్రీహరి
శాసనసభలో కోరం లేదని బీఆర్ఎస్ అభ్యంతరం - కడియం, శ్రీధర్‌బాబు మధ్య డైలాగ్ వార్