ETV Bharat / state

అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే కౌంటింగ్ ప్రక్రియ - ఎలా జరుగుతుందో మీకు తెలుసా? - Vote Counting Process in India

Vote Counting Process : ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, అత్యంత కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది ఈ కౌంటింగ్. అటువంటి ప్రక్రియలో ఏ చిన్న తేడా జరిగినా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈసీ ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. కౌంటింగ్ సమయంలో ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. మరోవైపు బరిలోనున్న అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునే హక్కు పోటీచేసిన ప్రతి అభ్యర్థికి ఉంటుంది.

Vote Counting Process
Vote Counting Process in India (eenadu.net)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 9:49 PM IST

Vote Counting Process in India : దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ. కట్టుదిట్టమైన భద్రత, అధికారుల సమన్వయంతో ఎంత పకడ్బందీగా నిర్వహిస్తారో, కౌంటింగ్‌ ప్రక్రియకూ అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రధానంగా లెక్కింపు కోసం ఈసీ నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ ప్రక్రియను ఓసారి పరిశీలిస్తే.

➤ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు 1961లోని ‘రూల్‌ 54ఏ’ ప్రకారం, పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను తొలుత లెక్కిస్తారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ టేబుల్‌ వద్ద వీటిని మొదలు పెడతారు.

➤ పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాతే ఈవీఎంలలోని ఓట్లను కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది.

➤ ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు లేకుంటే నిర్దేశించిన టైమ్​కే ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలుపెట్టాలి.

➤ లెక్కిపునకు ఫారం 17సీతోపాటు ఈవీఎంలలోని కంట్రోల్‌ యూనిట్‌ (సీయూ) మాత్రమే అవసరం.

➤ సీయూల నుంచి రిజల్ట్​ను నిర్ధారించే ముందు, పేపర్‌ సీల్‌ చెదిరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తరవాత మొత్తం పోలైన ఓట్లను, ఫారం 17సీలో పేర్కొన్న సంఖ్యతో సరిపోవాలి.

➤ కౌంటింగ్ తర్వాత ఆ ఫలితాన్ని తొలుత లెక్కింపు సూపర్‌వైజర్‌, మైక్రో అబ్జర్వర్‌, కౌంటింగ్‌ ఏజెంట్లకు చూపించాలి.

➤ ప్రతి కంట్రోల్‌ యూనిట్‌లో అభ్యర్థి వారీగా వచ్చిన ఫలితాన్ని ఫారం 17సీలోని పార్టు-2లో రిజిస్టర్ చేయాలి.

➤ కంట్రోల్‌ యూనిట్‌లోని డిస్‌ప్లే ప్యానెల్‌పై ఒకవేళ రిజల్ట్ కనిపించకుంటే, అన్ని సీయూల లెక్కింపు పూర్తైన తర్వాత, ఆయా వీవీ ప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలి.

➤ ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు చెందిన ఫారం 17సీని, చివరి ఫలితాన్ని కంపైల్‌ చేస్తున్న అధికారికి పంపించాలి. ఆయన వాటిని ఫారం 20లో పొందుపరుస్తారు.

➤ కంట్రోల్‌ యూనిట్‌లలో ఓట్ల కౌంటింగ్ పూర్తైన తర్వాతే వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు మొదలుపెట్టాలి.

➤ ప్రతి శాసనసభ నియోజకవర్గం/లోక్‌సభ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఐదు పోలింగ్‌ స్టేషన్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకొని, వాటిలోని ఒక్కో వీవీప్యాట్‌లోని స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుంది.

➤ తిరస్కరణకు గురైన పోస్టల్‌ బ్యాలెట్‌ల సంఖ్య కంటే గెలుపు మార్జిన్‌ తక్కువగా ఉన్నట్లయితే, ఆ సమయంలో మాత్రమే రిజెక్టయిన పోస్టల్‌ బ్యాలెట్‌లను మరోసారి తప్పనిసరిగా పునః పరిశీలించాలి. ఆ తర్వాతే ఫైనల్ రిజల్ట్ వెల్లడించాలి.

➤ ఇద్దరు అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినట్లయితే, డ్రా తీసి ఫలితం ప్రకటిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.