Vipassana Dhyanam : విపశ్యన అనేది భారతదేశపు అతి పురాతన ధ్యాన పద్ధతి. దేశంలో కనుమరుగైన ఆ పద్ధతిని 2 వేల 600 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు వెలికితీసినట్లు ప్రాచుర్యంలో ఉంది. విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో 2005లో "దమ్మ కొండన్న విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రం" ఏర్పాటైంది. 2007నుంచి కోర్సులు ప్రారంభం కాగా ఇక్కడ శిక్షణ పొందే వారిని సాధకులుగా పిలుస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకున్న వారినే శిక్షణకు అనుమతిస్తారు. ప్రస్తుతం కోర్సు 10 రోజుల పాటు సాగుతుండగా ప్రవేశం పొందిన వారికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నారు.
ఇమ్యూనిటీని పెంచుకోవాలా? ఈ 5 యోగాసనాలు చేయండి
Vipassana International Meditation Centre : అక్కడ ఉన్నన్ని రోజులు కనీసం ఒకరినొకరు చూసుకోకుండా నియమ, నిబంధనలతో విపశ్యన ధ్యానం సాగుతోంది. అక్కడ నేర్చుకొని వెళ్లిన సాధకులిచ్చే విరాళాలతోనే ధ్యాన కేంద్రం నడుస్తోంది. శిక్షణా కాలంలో కల్పించిన సౌకర్యాలకు ప్రతిగా తమ వంతు సాయం చేస్తున్నట్లు సాధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏర్పాటైన ధ్యాన కేంద్ర స్థలం పూర్వ సాధకులిచ్చిందే. అక్కడ పండిస్తున్న పండ్లు, పూలు,కూరగాయలనే భోజనాలకు వినియోగిస్తున్నారు. విపశ్యన ధ్యానంతోనే ఎన్నో ప్రయోజనాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.
"పది రోజుల శిబిరం వల్ల లాభం ఏంటంటే సైంటిఫిక్‌గా మనుషులకు ఇతరుల పట్ల ఉన్న రాగ ద్వేషాలు వేర్ల నుంచి తొలగించవచ్చు. దీన్ని సైంటిఫిక్ ఎందుకంటాం అంటే ఒకరు చెప్తే మనం నమ్మడం కాదు. మన అనుభూతి ద్వారా మనం తెలుసుకుంటాం. అలా మనల్ని మనం మంచి మార్గంలో వెళ్లేలా తీర్చిదిద్దుకుంటాం."- హరీశ్ నాథ్, ధ్యాన కేంద్ర ఇంఛార్జీ
శబరిమల భక్తుల కోసం 300 అడుగుల బావిలో యోగా- నీటిలో తేలుతూ ఆసనాలు
దమ్మ కొండన్న విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రం : శిక్షణ పూర్తైన తర్వాతనే సాధకులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఎన్నో రకాల ఇబ్బందులు, ఒత్తిళ్లతో విసుగు చెందిన వారికి ఇక్కడి వాతావరణం మంచి అనుభూతినిస్తుందని తెలిపారు. ఒక్కసారి విపశ్యన ధ్యాన శిక్షణ తీసుకుంటే తప్పని సరిగా మళ్లీ ప్రారంభమయ్యే కోర్సులో పాల్గొంటారని సాధకులు వెల్లడిస్తున్నారు. తమలాగే ఇబ్బంది పడుతున్న వారిని ఈ కేంద్రంలో చేర్పించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందారని వివరిస్తున్నారు. క్రమపద్దతిలో ధ్యానవిధిని బోధించడం, ప్రవచనాలతోసాధన పూర్వాపరాలను తెలుసుకుంటున్నారు.
విపశ్యన ధ్యాన శిక్షణ : శిక్షణ పూర్తైన చివరిరోజు మైత్రీభావన అభ్యసిస్తున్నారు. విపశ్యన ధ్యానంతో జీవితంలో తెలుసుకోలేని కొన్ని మార్పులను తెలుసుకున్నట్లు సాధకులు చెబుతున్నారు. సమాజంలో దిగజారిపోతున్న నైతిక విలువల పునరుద్ధరణ, అలజడి, ఒత్తిడి లేని జీవన విధానానికి విపశ్యన ధ్యానం ఉపకరిస్తుందని సాధకులు చెబుతున్నారు.
6 యోగాసనాలతో పని ఒత్తిడి మాయం! ఆఫీస్‌లోనే కుర్చీలో ఈజీగా వేసేయండిలా!
International Yoga Day 2023 : ఒకేసారి 1.53లక్షల మందితో యోగా.. సూరత్ గిన్నిస్ రికార్డ్