ETV Bharat / state

వింత ఆచారం- కీడు వచ్చిందనే అనుమానంతో గ్రామాన్ని ఖాళీ చేసిన గ్రామస్థులు - Superstitions in the village - SUPERSTITIONS IN THE VILLAGE

Superstitions In the village : ఊరికి కీడు జరిగిందనే అనుమానంతో గ్రామస్థులంతా తమ ఇండ్లకు తాళం వేసి ఓ రోజంతా పొలాలు, చెట్ల కింద వంటచేసుకున్న ఘటన నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలంలో చోటుచేసుకుంది. గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తుండటంతో, ఒక రోజు ఇళ్లు విడిచిపెట్టడం ద్వారా మరణాలు తగ్గుతాయని స్థానికులు నమ్ముతున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే?

Superstitions in the village
Superstitions in the village (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 7:58 PM IST

Updated : Aug 9, 2024, 8:37 PM IST

Villagers left village one day in Nalgonda District : నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలోని ప్రజలు ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఊరికి కీడుపట్టుకుందనే అనుమానంతో ఓ రోజంతా గ్రామాన్ని విడిచి వ్యవసాయ బావులు, చెట్ల కిందకు చేరి వంటచేసుకున్న అక్కడే సేదతీరారు. ఈ విధంగా చేస్తే గ్రామంలో మరణాలు తగ్గుతాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

గత రెండు నెలలుగా అమ్మనబోలు గ్రామంలో వివిధ కారణాలతో వరుస మరణాలు సంభవిస్తుండటంతో గ్రామం ఉలిక్కిపడింది. ఊరి పెద్దలంతా మాట్లాడుకుని ఒక రోజంతా ఊరిలో అన్ని ఇళ్లను ఖాళీ చేసి ఇంట్లో పొయ్యి వెలగకుండా ఉండాలని నిర్ణయించారు. అందుకు గ్రామస్థులు వనమహోత్సవంలా వ్యవసాయ బావుల వద్ద, చెట్లకింద వంటచేసుకుని భోజనం చేసి సాయంత్రం వరకు ఊరి బయటే ఉండాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా ఓ రోజు ముందునుంచే గ్రామంలో వాణిజ్య సముదాయాలు, స్కూళ్లు, గ్రామ పంచాయతీ, వైన్సు ఇలా అన్ని మూసివేయాలని సమాచారం ఇవ్వడంతో గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది.

సుమారు 4000 ఓట్లు ఉండే ఈ గ్రామంలో, గత రెండు నెలల నుంచి ఒకరు తర్వాత మరొకరు వివిధ కారణాలతో చనిపోవడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో పెద్దమనుషులు చెప్పిన విధంగా గ్రామంలో చిన్నా పెద్దా వృద్ధులతో సహా అందరినీ గ్రామం వెలుపల ఉన్న వ్యవసాయ బావి వద్దకు చెట్ల కిందికు చేరి, సాయంత్రం ఐదు గంటల తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద నిప్పు ఇస్తే అది తీసుకెళ్లి ఇంట్లో వెలిగించుకోవాలని ఆ తర్వాత నుంచి యథావిధిగా గ్రామంలో రాకపోకలు జరుగుతాయని గ్రామస్ధులు చెబుతున్నారు.

గత పదేళ్ల క్రితం ఇదే నెలలో ఇలానే జరిగితే అప్పుడు కూడా ఒక్క రోజు ఊరిని విడిచి వెళ్లడం వల్ల మరణాలు తగ్గాయని పేర్కొంటున్నారు. అందువల్ల ఇప్పుడు కూడా అలా చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని గ్రామస్థులు నమ్ముతున్నారు. హైటెక్ యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలతో ఊరిని ఖాళీ చేయడం ఏంటని అధికారులు గ్రామస్ధులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మూఢనమ్మకాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు.

భద్రాద్రి రామాలయం అన్నదాన సత్రం పరిసరాల్లో బురద - అవస్థలు పడుతున్న భక్తులు - Bhadrachalam Submerged with dirt

అందరితో స్నేహం వృత్తిలోనే సంతోషం - ఈ కండక్టర్​ వెరీ ఫ్రెండ్లీ బ్రో - HYDERABAD LADY CONDUCTOR STORY

Last Updated : Aug 9, 2024, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.