ETV Bharat / state

మహానగరంలో మురుగు సమస్య - బెజవాడ అభివృద్ధికి బ్రేకులు - పారిశుద్ధ్యంలో విజయవాడ స్థానం

Vijayawada People Suffer With Drainage Problem: విజయవాడలో మురుగు సమస్య అంతకంతకూ తీవ్రమవుతోంది. దేశంలోనే పారిశుద్ధ్యంలో నగరం ఐదో స్థానంలో ఉందని వీఎంసీ పాలకవర్గం గొప్పలు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. జనాభాకు తగ్గ సంఖ్యలో కార్మికులు లేక ఉన్నవారిపైనే పనిభారం మోపుతుండటంతో చాలాచోట్ల డ్రెయిన్లు శుభ్రం చేయడం లేదు. దోమలతో సావాసం చేస్తూ ప్రజలు జబ్బుల పాలవుతున్నారు.

Vijayawada_People_Suffer_With_Drainage_Problem

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 8:29 AM IST

Updated : Jan 24, 2024, 9:17 AM IST

మహానగరంలో మురుగు సమస్య - బెజవాడ అభివృద్ధికి బ్రేకులు

Vijayawada People Suffer With Drainage Problem : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో 1.01 లక్షల ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉండగా కనెక్షన్లు లేని ఇళ్లు 1.09 లక్షల ఇళ్లు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికే కాలనీలు నీటమునుగుతున్నాయి. డ్రైనేజీలు పద్ధతి ప్రకారం శుభ్రం చేయకపోవడంతో చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీల్లో మురుగునీరు, చెత్తా చెదారం ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి.

రోడ్లపైనే చెత్త : వీఎంసీ అధికారులు, పాలక పక్షం దేశంలోనే విజయవాడ నగరం పారిశుధ్యంలో వెలిగిపోతోందని గొప్పలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. మురుగు కాలువల్లో నుంచి తీసిన చెత్తను సైతం రోజుల తరబడి రోడ్లపైనే విడిచిపెడుతున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

ఫ్లాట్లు ఇచ్చారు, పాట్లు మిగిల్చారు - ఆటోనగర్ అంటేనే భయపడుతున్న వాహనదారులు

నగర అభివృద్ధికి నిధులు విడుదల చేయన సీఎం జగన్ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో చాలా చోట్ల చేపట్టిన మురుగు కాలువల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే ఈ పనులు ఆగిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు అర్థాతరంగా ఆగిపోవడంతో చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగర అభివృద్ధికి గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) విడుదల చేస్తానన్న నిధులు నేటికీ పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. ఆ నిధులు రాబట్టడంలో స్థానిక నేతలు విఫలమయ్యారు.

Lack of Facilities in Autonagar: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్నా.. కనీస వసతులకు నోచుకోక అల్లాడుతున్న ఆటోనగర్‌

వీఎంసీ సిబ్బంది నగరవాసులు ఆగ్రహం : విజయవాడ నగరంలో పలు కాలనీల్లో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో చిన్నపాటి డ్రైనేజీలను ఇంటి యజమానులే నిర్మించుకున్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వీఎంసీ పాలక మండలి నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడల్లలో ఉండే ప్రముఖుల విగ్రహాల చుట్టూ పేరుకుపోయిన పిచ్చిమొక్కలను తొలగించడంలోనూ వీఎంసీ సిబ్బంది సరైన రీతులో చర్యలు చేపట్టడం లేదని నిప్పులు చెరుగుతున్నారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపండి సారూ : ఇప్పటికైనా విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు, పాలక మండలి స్పందించి మురుగు కాలువల సమస్యలకు ఓ శాశ్వత పరిష్కారం చూపాలని నగర ప్రజలు కోరుతున్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.

Vambay Colony People Problems Due to Poor Sanitation: వాంబే కాలనీవాసుల వ్యధ.. కానరాని మౌలిక వసతులు.. అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ

Last Updated : Jan 24, 2024, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.