ETV Bharat / state

మధ్యతరగతికి అందుబాటులో వస్త్రాలు, అలంకరణ సామాగ్రికి కేరాఫ్ బీసెంట్‌ రోడ్ - Vijayawada Beasant Road

Vijayawada Beasant Road has Special Place in Business Sector: బెజవాడలో ఏ షాపింగ్ కి అయినా పేద, మధ్యతరగతి ప్రజలు ఎంచుకునేది బీసెంట్ రోడ్డునే ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వస్తువులు, సరుకులు తక్కువ ధరకే లభిస్తాయనే నమ్మకం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం బెజవాడకు వచ్చే వారికి ఈ రోడ్డు ఉపాధి కల్పిస్తోంది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 7:52 PM IST

vijayawada_beasant_road
vijayawada_beasant_road (ETV Bharat)

Vijayawada Beasant Road has Special Place in Business Sector: రాష్ట్రంలోనే విజయవాడ అంటే ఓ వ్యాపార కేంద్రం. గవర్నర్ పేటలోని బీసెంట్ రోడ్డుకి వ్యాపార రంగంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. బీసెంట్ రోడ్డు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మందికి ఉపాధి అందిస్తోంది. మన అవసరాలకు కావాల్సిన అన్ని రకాల సరుకులు అందుబాటు ధరల్లో లభిస్తాయని ప్రజల నమ్మకం. ప్రధానంగా పేద, మద్యతరగతి ప్రజలు ఇంటిలో జరిగే అన్ని రకాల వేడుకలకు ఇక్కడే షాపింగ్ చేస్తారు. వారికి అవసరమైన అలంకరణ సామాగ్రి, వస్త్రాలతో పాటు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తారు.

బెజవాడలో వాణిజ్య కేంద్రాల్లో ముఖ్యమైనది బీసెంట్ రోడ్డు. ఇక్కడ వివిధ రకాల వస్తువులు, సామాగ్రితో పాటు చికెన్, చాపలు, కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు దారులకు అందుబాటులో ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పండుముసలి వరకు వాళ్లకు అవసరమైన అన్ని రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉండడంతో నిత్యం ఈ ప్రాంతం రద్దీగానే దర్శనం ఇస్తుంది. వేలాది మంది కొనుగోలు దారులు ఇక్కడకు వచ్చి వారికి కావాల్సినవి కొనుగోలు చేస్తుంటారు. బెజవాడ ప్రజలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో షాపింగ్ కోసం బీసెంట్ రోడ్డుకి వస్తారు.

జగనన్న మెగా లేఅవుట్‌లో భారీ అక్రమాలు- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం - irregularities in YCP Government

బీసెంట్ రోడ్డులో ఉన్న షాపులన్నీ కలిపి సుమారు 2వేల వరకూ ఉంటాయి. వీటిలో అధిక శాతం షాపులు తాత్కాలిక రిక్షాలు, ద్విచక్ర వాహనాల మీదే ఉంటాయి. శాశ్వత బిల్డింగుల్లో ఉండే షాపుల సంఖ్య నాలుగు వందల వరకు ఉంది. షాపింగ్ మాల్స్​తో పాటు అన్ని రకాల వ్యాపార సముదాయాల్లో పని చేసే వారి సంఖ్య సుమారుగా 10వేల వరకు ఉంటుంది. లెనిన్ సెంటర్ నుంచి ఎంజీ రోడ్డు వరకు ఉండే బీసెంట్ రోడ్డు అనేక మంది చిరువ్యాపారుల ఆకలి తీరుస్తోంది. వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.

ఇక్కడ చిరువ్యాపారులకు ప్రభుత్వాలు సైతం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి. రుణాలు సైతం మంజూరు చేస్తున్నాయి. తామంతా చిరువ్యాపారులమని తమకు ప్రభుత్వాలూ అండగా ఉండాలని ఇక్కడి వ్యాపారులు కోరుతున్నారు. రాష్ట్రంలోనే విజయవాడ అంటే ఓ వ్యాపార కేంద్రం. గవర్నర్​పేటలోని బీసెంట్ రోడ్డుకి వ్యాపార రంగంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1933 సంవత్సరంలో అన్నేబీసెంట్ అనే స్వాతంత్ర్య సమర యోధురాలు పేరుతో ఈ మార్కెట్ ఏర్పడింది.

ఏపీ, తెలంగాణ నా రెండు కళ్లు- తెలంగాణ గడ్డపై పార్టీకి పునర్‌వైభవం వస్తుంది: చంద్రబాబు - CM Chandrababu Rally in Hyderabad

సమస్యలకు నిలయాలుగా కొండ ప్రాంతాలు- కొత్త ప్రభుత్వానికి విన్నపాలు - Vijayawada hill dwellers problems

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.