Vigilance investigation on Mission Bhagiratha : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమలు చేసింది. సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయగా, ఆరేడు వేల కోట్ల విలువైన పనుల్లో అవినీతి జరిగినట్టు సర్కారు అనుమానిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయమై దర్యాప్తు సంస్థ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే చర్చించినట్లు సమాచారం.
కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ - విచారణ జరిపించాల్సిందే : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
Vigilance Enquiry On Misssion Bhagiratha Project : మిషన్ భగీరథ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఫిర్యాదులు రావడంతో దీనిపై సర్కారు ఫోకస్ చేసింది. జరిగిన పనులనే కొత్తగా చేసినట్లుగా నమోదు చేయడం, సామగ్రి కొనకుండానే కొన్నట్లు దస్త్రాల్లో చూపించడం, కొనుగోలు చేసిన పరికరాలు వినియోగించకుండా పక్కన పడేసి అక్రమంగా బిల్లులు లేపుకున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ జరిపించాలనే నిర్ణయానికి సర్కారు వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరోపణలు నిగ్గు తేల్చే క్రమంలో మండలానికి ఒక గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్టు, సంబంధిత మంత్రి కూడా విజిలెన్స్ అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ - ఫౌంటేన్‌లా ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు
Misssion Bhagiratha Project Works : ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని సమూహాలకు తాగునీరు అందిందనే అంశంపై నిజానిజాలు తెలుసుకునేందుకు కమిటీ వేయాలన్న ప్రతిపాదన ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ‘మిషన్ భగీరథ పథకాన్ని వంద శాతం అమలు చేసినట్లు, తద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందిస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించుకుంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వ పథకం ‘జల్‌జీవన్ మిషన్’ కింద నిధులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
వాస్తవంగా క్షేతస్థాయిలో రక్షిత మంచినీరు అందని ప్రాంతాలు, కుటుంబాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. మరోవైపు పట్టణాలు, నగరాలు విస్తరిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకూ రక్షిత మంచినీరు అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలంటే కమిటీ వేయడమే సరైన నిర్ణయం' అనే అభిప్రాయం మంత్రి మండలి సమావేశంలో వ్యక్తమైనట్టు తెలిసింది. తద్వారా వాస్తవ పరిస్థితిపై నివేదిక రూపొందిస్తే కేంద్ర నిధులు రాబట్టవచ్చని నేతలు పేర్కొన్నట్టు సమాచారం.
Mission Bhagiratha pipeline leakage in Lingapur : పైప్‌లైన్ లీకేజీతో.. మిషన్‌భగీరథ ఉప్పొం'గంగ'
Modi On Olympics : '2029 యూత్ ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ రెడీ.. 2036 కోసం భగీరథ ప్రయత్నం!'