ETV Bharat / state

అడుగడుగునా ఉల్లంఘనలు - విజిలెన్స్​ దాడుల్లో బట్టబయలు - Vigilance attack on illegal estates

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 10:19 AM IST

Vigilance and enforcement report on Illegal Constructions : హైదరాబాద్​లో నిత్యం ఏదో ఒక మూల భవనాల నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. ఈ నిర్మాణాలు అనేవి ప్రభుత్వానికి, రెరా, హెచ్​డీఎంఏకు అనుకూలంగా ఉండాలి. కానీ కొందరు అధికారులు అనుమతులు ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో విజిలెన్స్​ జరిపిన దాడుల్లో నలుగురు ప్లానింగ్​ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసి, నిర్మాణం సంస్థపై క్రిమినల్​ కేసును నమోదు చేశారు.

Jubilee Hills Multipurpose Mega Complex Construction
Jubilee Hills Multipurpose Mega Complex Construction (ETV Bharat)

Jubilee Hills Multipurpose Mega Complex Construction : హైదరాబాద్​లోని బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​లోని భవన నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ విచారణ జరిపింది. నందగిరి హిల్స్​లో 4.78 ఎకరాలు, జూబ్లీహిల్స్​ హౌసింగ్​ సొసైటీలోని రెండు ప్లాట్లకు సంబంధించిన 865.42 చదరపు గజాలు కలిపి నెట్​ నెట్​ వెంచర్స్​ ప్రైవేటు లిమిటెడ్​ సంస్థ చేపట్టిన మల్టీపర్పస్​ మెగా కమర్షియల్​ కాంప్లెక్స్​ నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయని ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ప్రకారం ముందు అనుమతులు మంజూరు చేసిన అధికారులను, పర్యవేక్షణకు సంబంధించిన అధికారులను విచారించింది. అనంతరం డాక్యుమెంట్లను పరిశీలించి బాధ్యులైన అధికారులపై చర్యకు సిఫార్సు చేసింది.

విజిలెన్స్​ నివేదికలోని ముఖ్యాంశాలు :

  • హెచ్‌ఎండీఏ భూమిని జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ లేఔట్‌లో చూపారు.
  • నెట్‌ నెట్‌ వెంచర్స్‌కు లబ్ధి కలిగించడానికి, ఎత్తుపై సడలింపు ఇవ్వడానికి, టీడీఆర్‌(ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంటల్‌ రైట్స్‌)కోసం ఇలా చేశారు.
  • డాక్యుమెంట్లు, నోట్​పైళ్లను పరిశీలించకుండానే ఉన్నతాధికారులు అప్పటికే ఉన్న సెల్లార్​ ఫ్లోర్లను స్టిల్ట్​ ఫ్లోర్లుగా మారుస్తూ సవరణ అనుమతులు ఇచ్చారు.
  • డాక్యుమెంట్లను పరిశీలించకుండానే అప్పటికే నిర్మించిన ఆర్‌సీసీ శ్లాబుల కింద బేస్‌మెంట్‌ ఫ్లోర్, స్టిల్ట్‌ ఫ్లోర్ల నిర్మాణానికి అనుమతులు సవరించారు.
  • అప్పటికే ఒక్కో శ్లాబ్​ నాలుగున్నర మీటర్లతో ఉంటే ఐదు మీటర్లకు ఇచ్చారు. జూబ్లీహిల్స్​ హౌసింగ్​ సొసైటీకి చెందిన 866 చదరపు గజాలతో కూడిన రెండు ఫ్లాట్లు వేర్వేరు పేర్లతో నమోదు చేశారు. ఆ రికార్డులను పరిశీలించకుండానే జూబ్లీహిల్స్​ హౌసింగ్​ సొసైటీ ఆమోదిత లేఔట్​కు భిన్నంగా అందుకు తగిన అనుమతులు ఇచ్చింది.
  • ఒక ప్లాట్​ మాత్రమే నెట్​ నెట్ వెంచర్స్​ ప్రైవేట్ లిమిటెడ్​ పేరుతో ఉండగా, రెండో ప్లాట్​ ఆ సంస్థ పేరుతో లేదు. కానీ సవరించిన అనుమతులు ఇచ్చారు.
  • 2017 ఫిబ్రవరి 7న ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్‌-305ను తప్పుగా అన్వయించి ఈ సంస్థకు ప్రయోజనం కల్పించారు’ అని నివేదికలో వివరించింది.

తొలుత జీ+5 తర్వాత జీ+12 : ఆగస్టు 8న రికార్డులను పరిశీలించి డిప్యూటీ సిటీ ప్లానర్​ ఏడు సెల్లార్లు, జీ+5 ఫ్లోర్లకు మొదటిసారిగా సవరించి భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. మళ్లీ 2022 ఫిబ్రవరి 17న రెండోసారి అప్పటికే ఉన్న ఆర్​సీసీ శ్లాబ్​ను పరిగణనలోకి తీసుకోకుండానే ఏడు స్టిల్ట్​, జీ+12 ఫ్లోర్లకు సిపార్సు చేశారని విజిలెన్స్​ నివేదించింది.

అలాగే నందగిరి హిల్స్​ను తవ్వి అక్కడున్న నేల స్వభావాన్ని వినియోగించుకొని ఏడు సెల్లార్లను ఏడు స్టిల్ట్​ ఫ్లర్స్​గా మార్చి అనుమతులు తెచ్చుకున్నారని విజిలెన్స్​ పేర్కొంది. 2021 మార్చి 2న ఇచ్చిన మరో జీవోను ఉల్లంఘించి టీడీఆర్​ ఫ్లోర్లకు అనుమతించారని గమనించారు. నిర్మాణంలో మార్పులున్నా సరే 2021 నవంబరు 3న రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2023 సెప్టెంబరు 26న సవరించిన భవన నిర్మాణానికి అనుమతిచ్చారని వివరించారు.

ఈ అక్రమాల్లో మొదట పనిచేసిన చీఫ్​ సిటీ ప్లానర్​, ఆ తర్వాత వచ్చిన చీఫ్​ సిటీ ప్లానర్​, ఇద్దరు డిప్యూటీ సిటీప్లానర్లు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణ సంస్థకు అనుకూలంగా వ్యవహరించారని విజిలెన్స్​ ఒక నివేదికలో పేర్కొంది. నిర్మాణ సంస్థ జీహెచ్​ఎంసీ అధికారులతో కుమ్మక్కై ఈ ఉల్లంఘటనలకు పాల్పడిందని తెలిపింది. ఈ క్రమంలో ఈ సంస్థపై క్రిమినల్​ కేసు నమోదు చేయాలని విజిలెన్స్​ సిఫార్సు చేసింది.

ఈ సూచనలు పాటించండి :

  • బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేటప్పుడు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి.
  • అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలి.
  • ఫీల్డ్​లో తనిఖీలు చేసి గతంలో తీసుకొన్ని కొలతను, ప్రస్తుత కొలతలను పరిశీలించాలి.
  • ఆ తర్వాత అనుమతి ఆదేశాలు జారీ చేయాలని, ఉల్లంఘనలు లేకుండా చర్యలు తీసుకోవాలి
  • ముఖ్యంగా పర్యావరణ అనుమతి మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.

తమ్మిడికుంట వద్ద 3.30 ఎకరాలు ఆక్రమించిన ఎన్​ కన్వెన్షన్‌ : హైడ్రా - Hydra On N Convention Demolition

ఇల్లు కొంటున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు - Tips to Avoid Real Estate Scams

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.