Vice President Jagdeep Dhankhar to Telangana : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు పర్యటనపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి బ్లూబుక్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.
పటిష్ఠమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు, వైద్య సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్న సీఎస్ శాంతికుమారి, ఉప రాష్ట్రపతి ప్రయాణించే దారిలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చేయాలని, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, గవర్నర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ తదితర అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పర్యటన సందర్భంగా తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, కీలక అధికారులు స్వాగతం పలకనున్నారు.
శీతాకాల విడిదికై రాష్ట్రానికి రాష్ట్రపతి రాక - స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
' బొల్లారంలో 120 అడుగుల ఫ్లాగ్పోస్ట్ను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము'