ETV Bharat / state

ఉగాది వేళ కొత్త సంకల్పం తీసుకోవాలి - ప్రకృతితో కలిసి జీవించాలి : వెంకయ్యనాయుడు - Ugadi Fest at Swarna Bharat Trust

Venkaiah Naidu Ugadi Wishes 2024 : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లోని స్వర్ణ భారత్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్​ సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి​ పాల్గొన్నారు.

Ugadi Celebrations at Swarna Bharat Trust at Muchintal

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 12:30 PM IST

Updated : Apr 9, 2024, 2:56 PM IST

ఉగాది వేళ కొత్త సంకల్పం తీసుకోవాలి - ప్రకృతితో కలిసి జీవించాలి : వెంకయ్యనాయుడు

Venkaiah Naidu Ugadi Wishes 2024 : ఈ ఏడాది అంతా సంతోషంగా, ప్రకృతితో కలిసి జీవించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉగాది పర్వదినం వేళ కొత్త సంకల్పం తీసుకోవాలని సూచించారు. భారత్​ను సూపర్​ పవర్​గా తీర్చిదిద్దడంలో కృషి చేద్దామని ప్రజానికానికి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లోని స్వర్ణభారతి ట్రస్ట్(Swarna Bharat Trust)​ ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్​ సీపీ రాధా కృష్ణన్, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు.

Ugadi Celebrations at Swarna Bharat Trust at Muchintal : పంచాంగ శ్రవణం పూర్తి అయిన తర్వాత మాజీ ఉపముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశ ప్రగతిలో మనమంతా భాగస్వామ్యం కావాలని తెలిపారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ముందడుగు వేయాలని కోరారు. భారత్​ను సూపర్​ పవర్​గా తీర్చిదిద్దడంలో కృషి చేద్దామని, సాధారణంగా సూపర్​ పవర్​ అనగానే అమెరికా, ఐరోపా సమాఖ్య, చైనా గుర్తుకు వస్తాయన్నారు. త్వరలో భారత్​ కూడా సూపర్​ పవర్​గా ఆవిర్భవించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్(India is Third Economic Power in World)​ ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు.

"ప్రభుత్వ సాయం నేరుగా పేదలకు అందేలా ప్రధాని మోదీ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాం. దళారులు లేకుండా ప్రభుత్వ లబ్ధి కుటుంబాలకు అందుతోంది. పదేళ్లుగా 7 శాతం వరకు వృద్ధిరేటు సాధిస్తున్నాం. మనదేశం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. దేశ ప్రగతిలో మనమంతా భాగస్వాములు కావాలి. అందరూ సుఖశాంతులతో, సంతోషంగా ఉంటేనే దేశాభివృద్ధి." - వెంకయ్యనాయుడు, మాజీ రాష్ట్రపతి

"ఉగాది అనేది తెలుగు వారికి ముఖ్యంగా మరింత ప్రత్యేకమైన పండుగ. కాలాన్ని గౌరవించుకునే పండుగ. జగత్​లోని చైతన్యాన్ని మేల్కొలిపి సరికొత్త ఆశయాలతో లోక కల్యాణార్థం మంచి ఆలోచనలు రంగరింపజేసే శుభదినమే ఉగాది. ఎప్పటికప్పుడు మారే కాలం మనలో కూడా అనేక మార్పును తీసుకువస్తుంది. అలాంటి కాలంతో పాటు వచ్చే మార్పులను తెలియజేస్తూ అదే సమయంలో గతాన్ని గుర్తుపెట్టుకుంటూ వర్తమానంలో మనిషి ముందుకు సాగాలి." - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

వసంత నవరాత్రులు ప్రారంభం- తొమ్మిది రోజులు ఇలా చేస్తే పరిపూర్ణ అనుగ్రహం!

తెలుగు భాష చాలా గొప్పది : కొత్త లక్ష్యాలతో ఆధునిక అభివృద్ధిపై దృష్టి సారించాలని రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్​ సీపీ రాధా కృష్ణన్ అన్నారు. పరిశోధన, ఆవిష్కరణల ద్వారా సమాజం శరవేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఉగాది రోజు(Ugadi Festival 2024) జరిగే పంచాంగ శ్రవణం శాస్త్రీయంగా అర్థం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి చాలా గొప్పదన్నారు. దేశంలో భిన్న కులాలు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ ధర్మం ప్రాతిపదికన ఐఖ్యంగా ఉన్నామని పేర్కొన్నారు. తెలుగు భాష చాలా గొప్పదని కీర్తించారు. స్వర్ణ భారత్​ ట్రస్ట్​ ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పన అద్భుతమని ఇంఛార్జి గవర్నర్​ సీపీ రాధాకృష్ణన్​ కొనియాడారు.

"క్రోధి నామ తెలుగు సంవత్సరం కొత్త ఆరంభం. కొత్త లక్ష్యాలతో ఆధునిక అభివృద్ధిపై దృష్టిసారించాలి. పరిశోధన, ఆవిష్కరణల ద్వారా సమాజం వేగంగా ముందుకెళ్తుంది. పంచాంగ శ్రవణ శాస్త్రీయతను అర్థం చేసుకుని ముందుకెళ్లాలి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి. తెలుగు భాష చాలా గొప్పది." - సీపీ రాధాకృష్ణన్, గవర్నర్

ఈ ఏడాది అందరికీ శుభం కలగాలి : రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణ భారత్​ ట్రస్ట్​ అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. మంచి వర్షాలు పడి రైతులు ఆనందంగా ఉండాలని కోరారు. ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులు ఏమీ జరగకుండా దేశం ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

తెలుగు వాకిళ్లల్లో క్రోధి నామ సంవత్సరం సందడి - ఉగాది వేళ కళకళలాడుతున్న మార్కెట్లు

క్రోధి నామ సంవత్సరం రాశి ఫలాలు- వారికి ఆదాయం 2, వ్యయం 14!

Last Updated : Apr 9, 2024, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.