ETV Bharat / state

బెడ్‌ కింద ఇవి పెడుతున్నారా? - భార్యాభర్తల మధ్య గొడవలకు ఇవే కారణం కావొచ్చు! - Vastu Tips for home

Vastu Tips for Bedroom : చాలా మంది హిందువులు వాస్తు విషయంలో పక్కగా ఉంటారు! వాస్తు నిపుణులు చెప్పిన ప్రకారమే ఇంటి నిర్మాణం చేపడతారు. అయినప్పటికీ.. ఇంట్లో చికాకులు ఏర్పడుతుంటాయి. దీనికి బెడ్​రూమ్​లో వాస్తు దోషం కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు. మంచం కింద కొన్ని వస్తువులు ఉంచకూడదని వారు చెబుతున్నారు!

Vastu Tips for Bedroom
Vastu Tips for Bedroom
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 12:43 PM IST

Vastu Tips for Bedroom : భారతదేశంలో మెజారిటీ జనం వాస్తు ప్రకారమే నడుచుకుంటారు. ఇంటి నిర్మాణం, గదులు, ఇంట్లోని వస్తువులు ఇలా.. అన్నింటిలోనూ కచ్చితంగా వాస్తు నియమాలను పాటిస్తారు. ఇలా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్‌ వాతావరణం ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఇంటి నిర్మాణమే కాదు.. లోపల వస్తువుల విషయంలోనూ వాస్తు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే బెడ్‌రూమ్‌లో కొన్ని వస్తువులు ఉంచకూడదని చెబుతున్నారు. వీటి వల్లే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, ఇంట్లో అశాంతి నెలకొనడం వంటివి జరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే.. బెడ్​ రూమ్​ను ఎలా ఉంచుకోవాలో.. బెడ్‌ కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదో వివరిస్తున్నారు.

చిందరవందరగా ఉంచకూడదు..
చాలా మంది ఇంట్లో ఏవైనా అదనపు వస్తువులు కనిపిస్తే.. ఖాళీ ప్లేస్ ఉందికదా అని వాటిని బెడ్‌ కిందకు తోసేస్తుంటారు. కానీ.. ఇలా చేయవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా బెడ్‌ కింద చెత్త, చెల్లాచెదురుగా ఉండే వస్తువులను పెట్టడం వల్ల నిద్రా భంగం కలుగుతుందని అంటున్నారు. అలాగే పాత బట్టలను కూడా బెడ్ కింద ఉంచవద్దట. బెడ్‌ కింద ఎల్లప్పుడూ ఖాళీ స్థలం శుభ్రంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఇలా చేస్తేనే భార్యభర్తల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉంటాయట.

ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచవద్దు..
కొంత మంది ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను బెడ్‌ కింద పెడుతుంటారు. కానీ, ఇలా చేయవద్దు. దీనివల్ల భార్యభర్తల మధ్య అనవసరంగా గొడవలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరాల వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందట. కాబట్టి వీటిని బెడ్‌రూమ్‌ బయట ఎక్కడైనా పెట్టాలని అంటున్నారు.

చెప్పుల విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? - ఆర్థిక నష్టాలు తప్పవట!

బూట్లు, చెప్పులు ఉంచవద్దు..
కొంత మంది ఆఫీస్‌ నుంచి అలసిపోయి వచ్చి బూట్లు, చెప్పులను బెడ్‌ కిందకు తోసేస్తుంటారు. కానీ.. ఇలా బూట్లు, చెప్పులను బెడ్‌రూమ్‌లోకి తీసుకురావద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే.. మనం వీటిని వేసుకుని ఎక్కడెక్కడో తిరిగి వస్తాము. దీనివల్ల వాటికి అంటుకున్న మలినాలు, నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. దీంతో మనం అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని గది బయటే పెట్టాలి.

బెడ్‌ కింద చీపురు ఉంచవద్దు..
వాస్తు నియమాల ప్రకారం ఎప్పుడూ చీపురుని మంచం కింద పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతాయట. అందుకే.. గదిని శుభ్రం చేసిన తర్వాత చీపురును మూలకు పెట్టాలి.

విరిగిన లేదా దెబ్బతిన్న వస్తువులను మంచం కింద ఉంచవద్దు..
ఇంట్లో చెక్కతో చేసిన వస్తువులు ఏవైనా విరిగిపోతే.. వాటిని బయట పెట్టకుండా బెడ్‌ కింద పెడుతుంటారు. కానీ.. ఇలా దెబ్బతిన్న వస్తువులను మంచం కింద పెట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వీటిని మంచం కింద పెట్టడం వల్ల భార్యభర్తల మధ్య అనుబంధం దెబ్బతింటుందట. కాబట్టి.. ఏవైనా వస్తువులు పాడైపోతే వాటిని స్టోర్‌రూమ్‌లో మాత్రమే ఉంచాలని సూచిస్తున్నారు.

మీరు కొత్తగా ఇళ్లు కడుతున్నారా? ఈ వాస్తు నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు గ్యారెంటీ!

పెళ్లైన స్త్రీలు పాపిట్లో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు? - శాస్త్రం ఏం చెబుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.