ETV Bharat / state

వరద బాధితులకు బాసటగా టాలీవుడ్​ కీలక నిర్ణయం - థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ - Flood Donations For Telugu States - FLOOD DONATIONS FOR TELUGU STATES

Celebrities Donates Flood Victims Of Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సామాన్యులు తమ వంతు సాయం చేస్తుంటే సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా సాయం ప్రకటించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సైతం ఓ​ కీలక నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణకు, థియేటర్ల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్ణయించింది.

Tollywood Special Committee on Troubles in Flood Affected Areas
Celebrities Donates Flood Victims Of Telugu States (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 7:42 PM IST

Updated : Sep 5, 2024, 7:59 PM IST

Tollywood Special Committee on Troubles in Flood Affected Areas : వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విపత్తు వేళ మానవత్వం చాటాలన్న ప్రభుత్వం పిలుపుతో మనసున్న మారాజులు కదలివస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయం కోసం తెలుగు చలన చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. అంతేకాకుండా ప్రత్యేక కమిటీని నియమించి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వారి అవసరం మేర సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు హైదరాబాద్​లోని ఫిల్మ్ ఛాంబర్​లో అధ్యక్షుడు భరత్ భూషణ్ సహా నిర్మాతలు సురేశ్​ బాబు, దిల్ రాజు, దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, ఛాంబర్ సభ్యులు సమావేశం నిర్వహించి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలకు తమ మద్దతు ప్రకటించారు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలోని అగ్ర నటీనటులు, దర్శక నిర్మాతలు తమ వంతు సహాయంగా భారీ విరాళాలు ప్రకటించగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఫెడరేషన్ కూడా సహాయాన్ని ప్రకటించింది.

Actor Varun Tej Donates to Flood Relief Fund : ఫిల్మ్ ఛాంబర్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షలు, నిర్మాతల మండలి చెరో రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించగా నిర్మాతలు సురేశ్​ బాబు తమ కుటుంబం తరఫున కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే మరో నిర్మాత దిల్ రాజు తమ నిర్మాణ సంస్థల తరపున ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు. ఫిల్మ్ ఫెడరేషన్​లోని కార్మికులంతా శుక్రవారం సమావేశమై ఒక రోజు వేతనాన్ని వరద బాధితుల సహాయం కోసం ప్రకటించనున్నారు.

చిత్ర పరిశ్రమ ప్రజల ఆదరణతో ఎదిగిందని, వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కోసం ఎప్పుడు ముందుంటుందని దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు తెలిపారు. అంతకముందు వరద సహాయక చర్యలకు నటుడు వరుణ్‌తేజ్‌ రూ.15 లక్షల విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి చెరో రూ.5 లక్షలు విరాళంతో పాటు, ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు మరో రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు.

MP Mallu Ravi Donation for Floods Victims : ముఖ్యమంత్రి నిధికి నాగర్​కర్నూల్ ఎంపీ మల్లు రవి తన నెల జీతాన్ని విరాళం ఇచ్చారు. వర్షాలు, వరదలతో విలవిలలాడుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు చేదోడుగా తన నెల జీతం రూ.లక్షా 90వేల మొత్తాన్ని విరాళం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఖాతా పేరున ఆయన చెక్‌ ప్రభుత్వానికి అందించినట్లు వివరించారు.

ప్రకృతి వైపరీత్యాలతో జనం విలవిలలాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తానే కాకుండా ఎంపీలందరి వద్ద నుంచి ఎంపీల కన్వీనర్‌గా వారి వద్ద నుంచి విరాళాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మరోవైపు వరద బాధితుల సహాయార్ధం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీకి రూ.కోటి చొప్పున విరాళమిచ్చారు. ఈ మేరకు రూ.కోటి విరాళం చెక్కును ఖమ్మం కలెక్టర్‌కు పార్థసారథి రెడ్డి అందజేశారు.

వరద బాధితుల కోసం విద్యుత్‌శాఖ ఉద్యోగుల చేయూత : వరద బాధిత కుటుంబాలకు ఆదుకునేందుకు తమవంతు సహాయంగా విద్యుత్‌శాఖ ఉద్యోగులు, ఒకరోజు మూలవేతనం 15 కోట్ల రూపాయలు విరాళం అందించనున్నట్టు తెలిపారు. అరబిందో ఫార్మా రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది. ఆ సంస్థ ఎండీ కె.నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ మదన్‌మోహన్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి చెక్కు అందజేశారు. అదేవిధంగా సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈమేరకు ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సీఎంకు చెక్కును అందజేశారు.

తెలంగాణలోని ఎస్‌బీఐ ఉద్యోగులు సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించి చెక్కును సీఎంకు అందజేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్​తో పాటు కార్పొరేటర్లంతా ఒక నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కార్పొరేటర్లందరితో కలిసి ఆ మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు.

పవర్ స్టార్ మంచి మనసు - వరద బాధితులకు పవన్ కల్యాణ్ రూ.6 కోట్ల విరాళం - PAWAN KALYAN DONATES 6 CRORES

తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు - ఎన్టీఆర్​ సహా ఎవరెవరు ఎంత ఇచ్చారంటే? - NTR Donate 1 Crore to Telugu States

Last Updated : Sep 5, 2024, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.