US Consul General Met Pawan Kalyan and Lokesh: అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. జెన్నిఫర్ లార్సన్ను, ఆమె బృందాన్ని పవన్ కల్యాణ్ సత్కరించారు.
పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందనీ, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు. పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యుఎస్ కాన్సులేట్ జనరల్
— JanaSena Party (@JanaSenaParty) July 30, 2024
అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్ర, సులభతరమైన వీసా విధానం, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.@USCGHyderabad@USAndHyderabad pic.twitter.com/LqRO9MvKoA
US CONSUL GENERAL MET NARA LOKESH: మంత్రి నారా లోకేశ్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటి అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో లోకేశ్‌ను జెన్నిఫర్ మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు చర్చించారు. అనంతరం అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
భారతీయ అమెరికన్లలో దాదాపు 14 శాతం మంది తెలుగువారు ఉన్నారని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. వారు భారత్-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేసి, సంస్కృతి, వారసత్వ సౌందర్యాన్ని ప్రదర్శించారని విశ్వసించారు. ఈ బంధాన్ని మరింత పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్ గొప్ప పాత్ర పోషిస్తుందని ఎదురుచూస్తున్నట్లు ఆకాంక్షించారు.
Today, I had the pleasure of meeting the U.S. Consul General (Hyderabad), Ms Jennifer Larson.
— Lokesh Nara (@naralokesh) July 30, 2024
Telugus account for almost 14% of all Indian Americans. I firmly believe that they have strengthened ties between India and the U.S., enriching our communities and showcasing the beauty… pic.twitter.com/wffy2c6C9U
Minister Nara Lokesh Praja Darbar: మరోవైపు మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు ప్రజలు భారీగా పోటెత్తున్నారు. తమ కష్టాలు చెప్పుకునేందుకు ప్రజాదర్బార్‌కు ప్రజలు తరలివస్తున్నారు. నారా లోకేశ్ బాధితుల కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉండవల్లిలోని నివాసంలో 20వ రోజు ప్రజాదర్బార్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాదర్బార్ కార్యక్రమానికి వేకువజాము నుంచే జనం బారులు తీరారు. ప్రతి ఒక్కరినీ నేరుగా కలిసిన మంత్రి, వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు.
“ప్రజాదర్బార్” 20వ రోజు ఉండవల్లి నివాసంలో నిర్వహించాను. అందరి నుంచి వినతులు స్వీకరించాను. సమస్యలు తెలుసుకున్నాను. గత ఐదేళ్లలో వైసీపీ పాలకుల బాధితులే ఎక్కువమంది తమకు న్యాయం చేయాలని వస్తున్నారు. ఆయా విభాగాలతో సమన్వయం చేసుకుని వీలైనంత తొందరగా అందరి సమస్యలు… pic.twitter.com/JsrD7vqwLF
— Lokesh Nara (@naralokesh) July 30, 2024
అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ - Lokesh Released Academic Calendar
Pawan Kalyan on Olympics Medal: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కడం సంతోషదాయకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి మరో పతకం అందించిన షూటర్లు సరబ్‌జీత్ సింగ్, మను బాకర్‌లకు అభినందనలు తెలిపారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో కాంస్యం సాధించడం సంతోషదాయకమన్నారు. మన దేశం నుంచి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మను బాకర్ రికార్డు సాధించి క్రీడాభిమానులకు ఉత్తేజాన్నిచ్చారని కొనియాడారు.
ఒలింపిక్స్ లో మరో పతకం దక్కడం సంతోషదాయకం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు@realmanubhaker@Sarabjotsingh30#Cheer4Bharat#Paris2024#IndiaAtParis2024 pic.twitter.com/IAi2Miedo1
— JanaSena Party (@JanaSenaParty) July 30, 2024
Nara Lokesh on Olympics: భారత్‌కు మరో ఒలింపిక్ పతకం తెచ్చిన మను బాకర్, సరబ్‌జీత్ సింగ్‌లకు మంత్రి నారా లోకేశ్, మంత్రి అచ్చెన్నాయుడులు అభినందించారు. ఈ విజయంతో మను బాకర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని కొనియడారు. 124 ఏళ్లలో రెండు ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. మను బాకర్ తన రెండో పతకంతో భారత్‌కు మరో చారిత్రక విజయం అందించారు. ఒకే ఒలింపిక్స్ సీజన్లో రెండు పతకాలతో మనుబాకర్ రికార్డు సొంతం చేసుకోవడాన్ని ఆదర్శంగా తీసుకుని పలువురు క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని అచ్చెన్న ఆకాంక్షించారు.
Another Olympic medal for India! Congratulations to Manu Bhaker and Sarabjot Singh on winning bronze for India in the 10-meter air pistol mixed doubles! With this achievement, Manu Bhaker has etched her name in history, becoming the first Indian in 124 years to win two Olympic… pic.twitter.com/OROlSSAYJH
— Lokesh Nara (@naralokesh) July 30, 2024
మను బాకర్ తన రెండో పతకంతో భారత్‌కు మరో చారిత్రక విజయం అందించారు.
— Kinjarapu Atchannaidu (@katchannaidu) July 30, 2024
పారిస్ ఒలింపిక్స్ లో దేశానికి మరో పతకం అందించిన సరబ్జోత్ సింగ్, మను బాకర్ ఇరువురుకి హృదయపూర్వక అభినందనలు..
ఒకే ఒలింపిక్స్ సీజన్లో రెండు పతకాలతో మనుబాకర్ రికార్డు సొంతం చేసుకోవడాన్ని ఆదర్శంగా తీసుకుని పలువురు… pic.twitter.com/OcRb4i9TPu
మడ అడవులు విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు : పవన్ కల్యాణ్ - Pawan on Mada Forests Protection