Union Minister Kishan Reddy Visits Medaram Jatara : జాతీయ పండగ విషయంలో కొంతమంది తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ పండగ అనే వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. దేశంలో ఏ పండగను కూడా జాతీయ పండుగగా ప్రకటించలేదన్నారు. మేడారంలో సమక్క - సారలమ్మ లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అంతకు ముందు తులాభారం సమర్పించారు. ఆ తర్వాత మేడారంలో మీడియా సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం తరపున మేడారం మౌలిక వసతుల కోసం ఆర్థికంగా నిధులు సమకూర్చాం అన్నారు. సమ్మక్క - సారలమ్మ జాతరకు కేంద్ర ప్రభుత్వం తరపున రూ 3.14 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి సమ్మక్క - సారక్క జాతర జరుగుతుందని, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వస్తుంటారన్నారు.
'బండెనక బండి కట్టి - పదహారు బండ్లు కట్టి' - ఊరుఊరంతా మేడారం జాతరకు
గిరిజన యూనివర్సిటీనీ ఈ ఏడాది నుంచి అమ్మవార్ల పేర్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయన్నారు. రూ.900 కోట్లతో సమ్మక్క- సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుందన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ ఏర్పాటు కోసం 337ఎకరాల భూసేకరణ జరిగిందని మరికొంత జరుగుతుందన్నారు. ఈ సంవత్సరమే అడ్మిషన్లు జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారన్నారు. సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. వర్సిటీ నిర్వహణ కోసం తాత్కాలిక భవనం ఏర్పాటు చేస్తామని, మెజారిటీ సీట్లు గిరిజన బిడ్డలకే ఉంటాయని స్పష్టం చేశారు.
ఉత్సాహంగా సాగుతున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర - కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కమలం నేతల ఫైర్
యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించుకునే అవసరం ఎంతైనా ఉందన్నారు. తాత్కాలిక క్యాంపస్, తాత్కాలిక ఉద్యోగ నియామకాలు త్వరలోనే జరుగుతాయన్నారు. మెంటర్‌గా సెంట్రల్ యూనివర్సిటీ వీసీ వ్యవహరిస్తారన్నారు. ఎన్నికల తరువాత పూర్తి స్థాయి భవనాలకు భూమి పూజ ఉంటుందన్నారు. రామప్పను అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు.
విమానాశ్రయం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముందుకు సాగలేదని, ఎన్నిసార్లు లేఖలు రాసిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతామన్నారు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
సమ్మక్క సారలమ్మ జాతరలో గిరిజన మ్యూజియం - వారి జీవన విధానాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి
మేడారం భక్తులకు గుడ్‌న్యూస్ - అరచేతిలో 'జాతర' సమాచారం! - యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారా?