ETV Bharat / state

రుణమాఫీ అమలులో రేవంత్​ ప్రభుత్వం విఫలం : కాంగ్రెస్​పై కిషన్​రెడ్డి ఫైర్​ - KISHAN REDDY ON CROP LOAN WAIVER

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 7:40 PM IST

KISHAN REDDY ON CROP LOAN WAIVER : రాష్ట్రంలో రుణమాఫీ సకాలంలో జరగకపోవడంతో, రైతులు బ్యాంకుల్లో డీఫాల్డర్​గా మారుతున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ అందని బాధితులకు హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటుచేశామని, 8886100097 నెంబర్​కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు.

KISHAN REDDY FIRES ON CONGRESS
KISHAN REDDY ON CROP LOAN WAIVER (ETV Bharat)

KISHAN REDDY FIRES ON CONGRESS : రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని వాయిదాల పేరుతో కాలయాపన చేసిందని, కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ పథకం అమలులో, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తోన్న ఇంతవరకు రుణమాఫీని పూర్తిగా ఎందుకు అమలు చేయడంలేదని కిషన్​రెడ్డి నిలదీశారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి రుణమాఫీపై మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ స్పందన లేదు - ఎన్టీపీసీ ప్లాంట్‌ నిర్మాణంపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు - Kishan Reddy on NTPC thermal plant

రైతు వివరాల సేకరణ : రాష్ట్రంలో రుణమాఫీ సకాలంలో జరగకపోవడంతో రైతులు బ్యాంకుల్లో డీఫాల్డర్​గా మారేలా ఉన్నారని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఆందోళనలో మునిగారని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థాయిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరించి, రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కిషన్​రెడ్డి తెలిపారు.

మోసపూరిత హామీలు : రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి రూ. 15,000 పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రూ. 15,000 ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని కిషన్​రెడ్డి తెలిపారు. ఇందులో ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. అధికారం కోసం రైతులకు మోసపూరిత గ్యారంటీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను దగా చేయడంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఒక్కటేనని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, యువత, బీసీలు, మైనారిటీలు, మహిళలదరికీ వెన్నుపోటు పొడిచిందని కిషన్​రెడ్డి ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి నిధుల్లో కోతపెట్టి మోసం చేసిందని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో విద్యారంగానికి 14 శాతానికి పైగా బడ్జెట్ కేటాయింపులు జరిపితే, తెలంగాణలో మాత్రం 7.60 శాతం మాత్రమే బడ్జెట్​లో కేటాయించారని విమర్శించారు.

రుణమాఫీపై హెల్ప్​లైన్​ నెంబర్​ : రైతు రుణమాఫీ అందని బాధితుల కోసం హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా "ప్రశ్నిస్తున్న తెలంగాణ" పేరుతో పార్టీ కార్యాలయంలో గోడపత్రికను విడుదల చేశారు. రైతురుణమాఫీ అందని రైతులు రైతు హెల్ప్‌లైన్ నెంబర్ 8886100097 కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

"రాష్ట్రంలో రుణమాఫీ సకాలంలో జరగకపోవడంతో, రైతులు బ్యాంకుల్లో డీఫాల్డర్​గా మారేలా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రైతులకు మోసపూరిత గ్యారంటీలు, హామీలతో అధికారంలోకి వచ్చింది. రైతు రుణమాఫీ అందని బాధితుల కోసం హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నాము. రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాము". - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

మన రాష్ట్ర సంస్కృతి సంప్రాదాయలకు ప్రతీక బోనాల పండుగ : కిషన్‌రెడ్డి - union minister kishan reddy

అవినీతి, అసమర్థతతో పాలన చేతకాక కేంద్రాన్ని విమర్శిస్తున్నారు : కిషన్‌రెడ్డి - Kishan Reddy Fires On Congress BRS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.