ETV Bharat / state

'త్వరలోనే హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సేవలు'

రూ.430 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణం - పనులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : 9 hours ago

Union Minister Kishan Reddy inspected the cherlapally railway terminal
Union Minister Kishan Reddy On Railways (ETV Bharat)

Union Minister Kishan Reddy On Railways : అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చర్లపల్లి టర్మినల్‌ నెల రోజుల్లో ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.430 కోట్లతో కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ పనులను కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.చర్లపల్లి నంచి హైదరాబాద్‌ నగరంలోకి రోడ్‌ కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉందన్న కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ పనులను 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అంకితం చేస్తారని కేంద్రమంత్రి తెలిపారు. అమృత్‌ పథకంలో భాగంగా స్థానికంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

రూ.430 కోట్లతో చర్లపల్లి, రూ.715 కోట్లతో సికింద్రాబాద్‌, రూ.429 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్‌లలో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించినట్లు తెలిపారు. దానికి సంబంధించిన నిర్మాణ పనులు త్వరలో చేపడతామన్నారు.

"నెల రోజుల్లో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ టర్మినల్‌తో సికింద్రాబాద్ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. టర్మినల్‌ సమీప ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అన్ని రకాల సదుపాయాలతో టర్మినల్ ఏర్పాటైంది. టర్మినన్‌కు రోడ్ల కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. గతంలో కేసీఆర్‌కు చెప్పినా టర్మినల్‌కు వెళ్లే రోడ్లను పట్టించుకోలేదు. ఇప్పటికే కనెక్టివిటీ రోడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశా. రోడ్ల కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించామని ప్రభుత్వం చెప్పింది."-కిషన్‌ రెడ్డి, కేంద్ర మంత్రి

శరవేగంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ పనులు - 4 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి

బీఆర్​ఎస్​తో పొత్తుపై స్పందించిన కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.