ETV Bharat / state

బీఆర్​ఎస్​తో పొత్తుపై స్పందించిన కిషన్ రెడ్డి - KISHAN REDDY ON MUSI VICTIMS

పేదల ఇళ్లు కూల్చే ముందు వాళ్లతో చర్చించాలన్న కిషన్ రెడ్డి - హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదు - బీఆర్​ఎస్​తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని ప్రకటన

Kishan Reddy On Musi Victims
Kishan Reddy On Musi Victims (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 5:48 PM IST

Kishan Reddy On Musi Victims Houses Demolitions : మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరూ ధనవంతులు లేరని పేద ప్రజల ఇళ్లను కూల్చే ముందు వాళ్లతో చర్చించి ఒప్పించిన తర్వాతే ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అంతా మూసీలోనే కలుస్తోందని దానికి ప్రత్యామ్నయం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై ఆయన మీడియాతో చిట్​చాట్ నిర్వహించారు.

మూసీ సుందరీకరణ కోసం రూ.లక్షా యాభై వేల కోట్ల ఖర్చు అవుతుందన్న ప్రభుత్వం ఆ నిధులను ఎక్కడి నుంచి సమీకరిస్తుందో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిశాయని 40ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్లకు ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించాలని కిషన్‌ రెడ్డి అన్నారు.

బీఆర్​ఎస్​తో పొత్తు ఉండదు : మరోవైపు కూల్చివేతల విషయంలో హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తే బ్యాంకు రుణాలు ఎవరు చెల్లిస్తారని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు వార్తలను ఆయన ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.

370 విషయంలో పునరాలోచన అనేదే లేదు : జాతీయ అంశాలపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. జమ్మూ కశ్మీర్‌లో అర్టికల్ 370 విషయంలో పునరాలోచన అనేదే లేదని వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే కశ్మీర్‌లో మత కలహాలు, ఉగ్రవాదం తగ్గాయని కిషన్‌ రెడ్డి తెలిపారు. గత పదేళ్ల భాజపా పాలనలో మన దేశం అంతర్జాతీయంగా బలపడుతూ వస్తోందని పేర్కొన్నారు.

హర్యానాలో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ మాటలపై ఈసీ కూడా స్పందించి ఆ పార్టీని మందలించిందని కిషన్ రెడ్డి తెలిపారు. జమ్మూ రీజియన్‌లో కాంగ్రెస్‌కు ఒకే ఒక్క సీటు దక్కిందని, కశ్మీర్‌ లోయలో బీజేపీకి అధిక ఓటింగ్ శాతం నమోదైనా మెజారిటీ సీట్లు రాలేదని ఆయన తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో 29 సీట్లలో బీజేపీ గెలుపొందిందని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇన్ని సీట్లు దక్కలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

పథకాల పేరిట తెస్తున్న అప్పులు ఏం చేస్తున్నారు? - మహిళలకు ఇచ్చిన హమీలు ఏవీ? : కిషన్ రెడ్డి - KISHAN REDDYON CONGRESS GUARANTEES

ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ తిలోదకాలు - కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి : కిషన్​ రెడ్డి - Kishan Reddy Fires On Congress

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.