Unemployed Youth Thank you To Cm Chandrababu Naidu : మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సచివాలయంలో గురువారం మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేశారు. అన్ని రకాల పోస్టులు కలిపి 16,347 భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఉపాధ్యాయుడు కావాలన్న తమ కల నెరవేరే రోజు ఇచ్చినందుకు ధ్యాంక్యూ సీఎం సర్ అంటూ ధన్యవాదాలు తెలిపారు.
థాంక్యూ సీఎం సార్ : ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెట్టడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ళుగా టీచర్ కొలువు కోసం తాము కంటున్న కలలను నిజం చేశారని సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. థాంక్యూ సీఎం సార్ అంటూ పలుచోట్ల ఆయన చిత్రపటానికి పాలభిషేకం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడ్డారంటూ కొనియాడారు. 117 జీవో రద్దు చేసి ఎస్జీటీ పోస్టులు పెంచితే తమకు మరింత మేలు చేసిన వారవుతారని నిరుద్యోగులు కోరుతున్నారు.
నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాలకి పాలాభిషేకం : మెగా డీఎస్సీ పై మొదటి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టడంతో తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త మార్కెట్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ చిత్రపటాలకి పాలాభిషేకం తెలుగు యువత చేశారు. మెగా డీఎస్సీ ప తొలి సంతకం చేసిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువత అధ్యక్షుడు మొక్కల శ్రీనివాసరావు మాట్లాడుతూ 16 వేలు మెగా డీఎస్సీ వదలటం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు - తొలిరోజే ఆ ఐదు సంతకాలు పూర్తి - CM Chandrababu Naidu
శ్రీకాకుళం జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయడం చాలా ఆనందకరంగా ఉందని శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగి యువతి, యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయటంతో అనంతపురంలో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. టవర్ క్లాక్ సమీపంలో తెలుగు యువత నాయకులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆరేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న తమకు చంద్రబాబు తొలి సంతకంతో కలను నెరవేర్చారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు చంద్రబాబు తీపి కబురు చెప్పారని అన్నారు.
అవనిగడ్డ : కృష్ణాజిల్లా అవనిగడ్డలో వందలాది మంది నిరుద్యోగులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 16347 ఉపాధ్యాయ పోస్ట్‌లను మంజూరు చేస్తూ తొలి సంతకం చేయడంతో అవనిగడ్డ లో వేలాది మంది నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. అవనిగడ్డ ఎంఎల్ఏ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అవనిగడ్డలో ఉన్న విద్యార్థులు కూలీ పనులు చేసుకుంటూ కోచింగ్ తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు మెగా డీఎస్సీ ప్రకటించడం చారిత్రాత్మక మైనదన్నారు.
ఏపీలో నిరుద్యోగులకు పండగ- మెగా డీఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు తొలి సంతకం - Mega DSC Posts