Father Died Unable to Bear Daughter's Death in Wanaparthy : ఏ కుటుంబంలోనైనా కుమార్తె పుట్టింది అంటే మొట్టమొదటగా సంతోషించేది తండ్రే. కుమార్తెతో నాన్నకు ఉండే అనుబంధమే వేరు. చిన్నప్పటి నుంచి భుజాలపై మోసి, గుండెలపై అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి కుమార్తెకు చిన్న గాయమైనా తల్లడిల్లిపోతారు. తానేంత కష్టపడ్డా సరే వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. చెప్పాలంటే ప్రతి నాన్నకు ఆయన కుమార్తె మహారాణి. కొంతమంది నాన్నలను పేరుతో పిలిచేంత అల్లారుముద్దుగా పెంచుతారు. వారే ప్రపంచంగా బతికేస్తారు. అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అనారోగ్యంతో తండ్రి ముందే ప్రాణాలు వదిలేస్తే, ఆ ప్రాణం తట్టుకోలేకపోయింది. బిడ్డ మరణించిన కాసేపటికే ఆ గుండే ఆగిపోయింది.
ఆస్తి తీసుకుని రోడ్డుపై వదిలేసిన కుమారుడు - దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన తండ్రి
అనారోగ్యంతో మరణించిన కుమార్తెను చూసిన తండ్రి, గుండెపోటుతో మరణించిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. ఖిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన దేవరశెట్టి శ్రీనివాసుల దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. చిన్నప్పటి నుంచి ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏది కావాలన్నా, ఏం చేయలన్నా ఆలోచించకుండా కుమార్తె ఆనందం కోసం ఏదైనా చేసేవారు. సంతోషంగా ఉన్న ఆ చిట్టి తల్లికి ఆరోగ్య సమస్య వచ్చింది. కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదని తల్లడిల్లిపోయాడు ఆ తండ్రి. తన స్తోమతకు మించి చికిత్స చేయించాడు. కాగా ఆమె ఆరోగ్యం విషమించడంతో మృతి చెందింది. ఈ విషయం ఆ తండ్రి తీసుకోలేకపోయాడు. కూమార్తె మృతదేహంపై పడి గుండెలవిసేలా రోధించాడు. తల్లి లేవమ్మా, అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయా అంటూ మృతదేహంపై తలపెట్టి రోధిస్తూ అలాగే మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే తండ్రీకుమార్తె చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఆదుకోండయ్యా : ఏడాదిన్నర క్రితం తండ్రి - ఇటీవల తల్లి మృతి - అనాథలైన ఐదుగురు చిన్నారులు
ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలన్న అన్నపై తమ్ముడి దాడి - మనస్తాపంతో పిల్లలతో సహా తండ్రి బలవన్మరణం