ETV Bharat / state

విశాఖలో 'బైక్​ దొంగతనం' - తునిలో 'చైన్​ స్నాచింగ్​' - నెట్టింట వైరల్​ అవుతున్న వీడియో

ఎవ్వరికీ దొరకలేదని భ్రమపడ్డారు - ఆఖరికి సీసీ కెమెరాలకు దొరికారు. ఏపీలోని విశాఖపట్టణంలో బైక్​ దొంగతనం చేసిన యువకులు తునిలో చైన్​ స్నాచింగ్​ చేశారు.

Two Youth Chain Snatching Video Viral
Two Youth Chain Snatching Video Viral (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2024, 4:32 PM IST

Two Youth Chain Snatching Video Viral : ఏపీలో గొలుసు దొంగలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. జల్సాలకు అలవాటు పడిన కొందరు యువత ఈజీగా మనీ సంపాదించే క్రమంలో ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. ఆ క్షణంలో చేతిలో డబ్బులు లేకపోతే చైన్​స్నాచింగ్​నే ఈజీ మార్గమని భావించి, ఎదుటివారి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే కాకుండా స్థానికంగా నివాసం ఉండే కొంత మంది యువకులు సైతం ఇలాంటి గొలుసు దొంగతనాలు చేస్తున్నారు.

ముఖ్యంగా వీరి దొంగతనాలు ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా జరుగుతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా గొలుసు దొంగల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. వీరు పోలీసులకే సవాల్​ విసురుతూ ఎంతో చాకచక్యంగా దొంగ పనులు కానిచ్చేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలోని తునిలో ఇద్దరు యువకులు చోరీ చేసిన బైక్​తో సినీ ఫక్కీలో చైన్​ స్నాచింగ్​కు పాల్పడ్డారు.

వెలమ కొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ తునిలో నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఎదురుగా ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై రాగా, మరొక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చిన దుండగుడు లక్ష్మీ మెడలోని బంగారు ఆభరణాలను చాకచక్యంగా లాకున్నాడు. అనంతరం అక్కడి నుంచి బైక్​తో వారు పరారయ్యారు. ఈ పరిణామంతో బాధితురాలు ఒక్కసారిగా షాక్​కు గురైంది. వెంటనే తేరుకున్న సదరు మహిళ కేకలు వేయడంతో స్థానికులు వచ్చేలోగా దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు.

విశాఖపట్టణంలో బైక్​ దొంగతనం : గొలుసు దొంగతనం ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తునిలో చోరీకి పాల్పడిన యువకులు విశాఖపట్టణంలో ద్విచక్ర వాహనాన్ని దొంగలించి అదే వాహనంపై చైన్​ స్నాచింగ్​కు పాల్పడినట్లు గుర్తించారు. నిందుతులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. ఏపీలో వరుస గొలుసు దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ - అలా చైన్​ దొంగలించిన దుండగులు

నిర్మల్​ జిల్లాలో రెచ్చిపోయిన చైన్ ​స్నాచర్లు - మహిళ మెడలో నుంచి 3 తులాల గోల్డ్​చైన్​ అపహరణ - Chain Snatching AT Nirmal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.