ETV Bharat / state

సోషల్​ మీడియాలో స్టాక్​​ మార్కెట్​ లింక్​​ ఓపెన్ చేశారు - రూ.3.81 కోట్లు పోగొట్టుకున్నారు - Cyber Crime In Patancheru

Cyber Crime In Patancheru : పోలీసులు ఎంతగా అవగాహన పెంచిన అత్యాశపరుల్లో మార్పు రావడం లేదు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఎరతో సైబర్ నేరస్థులు ఎంతమందిని దోచుకున్నా కొత్తగా మోసపోయేందుకు వచ్చేవారి సంఖ్య తగ్గడం లేదు. అవగాహన లేని వారే కాదు విద్యావంతులు కూడా ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ఇలాగే పటాన్ చెరు పరిధిలో రెండురోజుల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్ నేరస్థులు రూ.3.81కోట్లు కొట్టేశారు.

Two Persons Lost Rs.3.81 Crore In Cyber Crime in Patancheru
Two Persons Lost Rs.3.81 Crore In Cyber Crime in Patancheru (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 2:19 PM IST

Updated : Aug 3, 2024, 2:54 PM IST

Two Persons Lost Rs.3.81 Crore In Cyber Crime in Patancheru : రెండు రోజుల్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.3.81 కోట్లు కొల్లగొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచోసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు సంగారెడ్డి పటాన్​చెరు ఏపీఆర్ లగ్జూరియాకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఫేస్​బుక్​లో నెలన్నర క్రితం స్టాక్​ మార్కెట్ పేరిట ఉన్న ఓ ప్రకటన చూసి దాన్ని క్లిక్​ చేశాడు. దీంతో అతను సైబర్ నేరగాళ్లు క్రియేట్​ చేసిన ఒక వాట్సాప్​ గ్రూప్​లోకి యాడ్ అయ్యాడు.

అనంతరం పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వారు చెప్పడంతో నమ్మి పెట్టుబడి పెట్టాడు. దీంతో ఒక పోర్టల్ క్రియేట్ చేసి పెట్టుబడి పెట్టినవారికి వచ్చిన లాభాలంటూ అందులో చూపించారు. ఇలా 22 దఫాలుగా ఏకంగా రూ.2.4కోట్లు పెట్టబడిగా పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ కోరడంతో సైబర్​ నేరగాళ్లు మొఖం చాటేశారు. బాధితుడు ఎంత అడిగినా స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి తొలుత సైబర్ క్రైమ్ పోలీసులకు, స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

"పటాన్​చెరు ఏపీఆర్​లో ఉండే ఓ వ్యక్తి గత 7వ తేదీనా స్టాక్ మార్కెట్ పేరిట మెసేజ్​ రాగా ఓపెన్ చేశాడు. వాట్సాప్​లో యాడ్​ అయ్యాడు. వాళ్లు సూచించిన యాప్​ డౌన్​లోడ్ చేసుకున్నాడు. నిందితులు చెప్పిన విధంగా పెట్టుబడులు పెట్టాడు. ఎక్కవ లాభాలు వస్తున్నాయని నమ్మేసి భారీగా ఇన్వెస్ట్ చేశాడు. బాధితుడు డబ్బులు అడగ్గా మోసపోయాయని గ్రహించి మాకు ఫిర్యాదు చేశాడు." - ప్రవీణ్ రెడ్డి, పటాన్​చెరు సీఐ

సైబర్ నేరగాళ్ల ఫ్రాడ్​ కాల్స్ - స్పందించారా ఇక అంతే సంగతులు! - Cyber Criminals Fake Calls

సేమ్​ రూట్ : మరో ఉద్యోగి యూట్యూబ్​ చూస్తుండగా స్టాక్​ మార్కెట్ ప్రకటన రాగా దాని లింక్​పై క్లిక్ చేశాడు. ఇతను కూడా వాట్సాప్​ గ్రూప్​లో యాడ్​ అయ్యాడు. దాదాపు నెల రోజులుగా రూ.66.75లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరగా ఖతం సీన్​ రిపీట్​ అయింది. ఇతను కూడా మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మీ నాన్నను అరెస్ట్ చేశామంటూ కాల్స్ వస్తున్నాయా? - ఐతే వెంటనే మీరు చేయాల్సిందిదే! - FRAUD CALLS IN TELANGANA

'మీ పిల్లలు ఫలానా కేసులో ఇరుక్కున్నారంటూ' కాల్స్​ వస్తున్నాయా? - అయితే జాగ్రత్త పడాల్సిందే! - Cyber Crime in Nizamabad

Last Updated : Aug 3, 2024, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.