IPL 2024 Black Tickets in Hyderabad : ఐపీఎల్ అంటేనే మస్త్ మజా ఉండే అతి పెద్ద క్రికెట్ క్రీడా పండగ. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ముందుగా షెడ్యూల్ చూస్తారు. ఎందుకంటే మ్యాచ్‌లు ఫ్రాంఛైజీల హోం గ్రౌండ్లలో ఆడుతున్నారేమోనని. తమ అభిమాన క్రికెటర్లను చూడాలని, ప్రత్యక్షంగా చూడాలని సగటు అభిమానులు అనుకుంటారు. అయితే వాటిలోనూ కొన్ని రసవత్తరమైన మ్యాచ్‌లను క్రికెట్ అభిమానులు నేరుగా స్టేడియాలకు వెళ్లి చూడాలని కంకణం కట్టుకుని ఉంటారు.
టికెట్ ఖరీదు ఎంత ఎక్కువైనా కొని స్టేడియంలోకి వెళ్లి ఆటను వీక్షించాలని భావిస్తారు. ప్రేక్షకుల సరదాని కొందరు సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకొని నకిలీ టికెట్లను సృష్టించి అమ్ముతున్నారు. ఇంకొందరేమో అధిక ధరలకు ఐపీఎల్ టికెట్లను విక్రయించి కొందరు అమ్ముతున్నారు. గురువారం జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్లను అధిక ధరకు బ్లాక్‌లో విక్రయించిన ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన 100 ఐపీఎల్ టికెట్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్‌కు ఉన్న విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో అక్రమ మార్గాల్లో టికెట్లను కొని అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు.
IPL మ్యాచ్ పవర్ ప్లే, స్ట్రాటెజిక్ టైమౌట్- క్రికెట్ నేర్పే బిజినెస్ పాఠాలివే!
క్రికెట్ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ : క్రికెట్ వాట్సాప్ గ్రూపులను పెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు విక్రయిస్తుండగా వారిని పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన రమణ, హైదరాబాద్‌కు చెందిన శామ్యూల్ సుశీల్‌లను అరెస్టు చేసి గోపాల్పురం పోలీసులకు అప్పగించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ టికెట్లు ప్రత్యక్షం : మరోవైపు గురువారం రోజున హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు(SRH vs RCB) మ్యాచ్‌కు విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని టికెట్లు ఉన్నాయంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రీల్స్, ఫొటోలను సైబర్ కేటుగాళ్లు ఉంచి లింక్‌ను ఓపెన్ చేయమని ఉచిత సలహా ఇచ్చారు. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే వెంటనే వ్యక్తిగత సమాచారం, బ్యాంకులోని డబ్బులు మాయమైపోయాయి. అయితే అధికారులు ఇలాంటి మోసాలపై ముందే అవగాహన కల్పించినా కొందరు మోసపోయారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో గెలుపొందింది.
స్టేడియంలో దారుణంగా కొట్టుకున్న రోహిత్ - హార్దిక్ ఫ్యాన్స్ - వీడియో వైరల్ - IPL 2024 MI VS GT
'రెండో గెలుపునకు 30 రోజులు, మూడోది ఎప్పుడో?'- ఆర్సీబీ విజయంపై ఫన్నీ మీమ్స్