ETV Bharat / state

డ్రైవర్​కు మత్తు మందు ఇచ్చి పసుపు లోడ్​ లారీ హైజాక్ - పోలీసులు ఏం చేశారంటే? - TURMERIC LOAD LORRY HIJACKED - TURMERIC LOAD LORRY HIJACKED

Turmeric Load Lorry Hijacked in Nizamabad : తాము ఆర్టీఏ అధికారులమంటూ నమ్మించి డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చి పసుపు లోడ్‌ లారీని హైజాక్‌ చేశారు. కొంత పసుపును జిల్లాలో అమ్మారు. వేరే ప్రాంతానికి వెళ్లి అమ్మేలోపే పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘనట నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Turmeric Lorry Hijacked in Nizamabad
Turmeric Lorry Hijacked in Nizamabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 8:12 AM IST

Updated : Jul 19, 2024, 3:07 PM IST

Turmeric Load Lorry Hijacked in Nizamabad : పసుపు లోడ్‌ లారీని దుండగులు హైజాక్ చేయగా పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి రెండు రోజుల కిందట పసుపు లోడ్‌తో బయలుదేరిన లారీ గుంటూరు చేరాల్సింది. అయితే ఇందల్వాయి టోల్‌ప్లాజా సమీపంలో ఓ కారులో వచ్చిన దుండగులు తాము ఆర్టీఏ అధికారులమంటూ ఆ లారీని ఆపేశారు. డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చారు.

అతను స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని కిందకు దించేసి లారీని హైజాక్ చేశారు. లారీలో నిజామాబాద్‌కు వచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో పలు చోట్ల పసుపు విక్రయించారు. తర్వాత నవీపేట మండలంలో జన్నేపల్లికి లారీని తరలించారు. విక్రయించగా మిగిలి ఉన్న పసుపు సంచులను ఇతర వాహనాల్లోకి మార్చి అమ్మాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం ఒక ప్రదేశం నుంచి పసులు తరలించి విక్రయించానుకున్నారు.

టమాటాల వ్యాన్​ హైజాక్.. 2500 కిలోల సరకుతో పరార్

నవీపేటకు చెందిన ఓ వ్యక్తి పసుపు సంచుల కోసం మూడు వాహనాలతో జన్నేపల్లికి వచ్చాడు. తీసుకొచ్చిన వాహనంలో పసులు సంచులను నింపుతున్నాడు. అయితే ఈ ప్రకియ అంతా స్థానికులు అనుమానంగా చూశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. మూడు వాహనాలను డ్రైవర్లను పోలీసులు పట్టుకున్నారు.

జన్నేపల్లిలో లారీ నుంచి ఇతర వాహనాల్లోకి ఏవో సంచులు తరలిస్తున్నారని మాకు సమాచారం అందింది. స్థానికుల సమాచారం మేరకు మేము వచ్చి చూస్తే పసుపు సంచులను తరలిస్తున్నారు. మమ్మల్ని చూడగానే నిందితులు అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడే ఉన్న డ్రైవర్లను అడిగితే అసలు నిజం బయటకు వచ్చింది. ఈ పసుపు లోడ్ లారీని ఇందల్వాయి టోల్ ప్లాజ్ దగ్గర హైజాక్ చేశారని మాకు చెప్పారు- పోలీసులు

పాత ఇనుప సామాను అమ్మే వ్యక్తి కిరాయికి తీసుకున్న షట్టర్​లో 100కు పైగా పసుపు బస్తాలు గుర్తించారు. నిన్న మధ్యాహ్న సమయంలో షట్టర్ లో బస్తాలు వేసినట్లు తెలుస్తోంది. షట్టర్​ను సీజ్ చేసి పసుపు బస్తాలను 1 టౌన్ స్టేషన్​కు తరలించనున్నారు. పరారీలో ఉన్న పాత ఇనుప సామాను షాప్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అతడే ప్రధాన సూత్రదారిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన సరుకు మొత్తం రూ.50 లక్షలు విలువ ఉంటుందని అంచనా.

వాణిజ్య నౌక హైజాక్- సముద్రపు దొంగలకు చుక్కలు చూపించిన ఇండియన్ నేవీ

Last Updated : Jul 19, 2024, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.