ETV Bharat / state

దశాబ్ధాల తర్వాత పసుపు పంటకు రికార్డు ధర - ఈ సీజన్​లో ఇందూరు మార్కెట్​లో వెయ్యి కోట్ల లావాదేవీలు - Turmeric Price Hike in Nizamabad - TURMERIC PRICE HIKE IN NIZAMABAD

Rise In Turmeric Price in Telangana : ఇందూరు పసుపు పంటకు దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయి ధరలు లభించాయి. నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో రూ.18వేలకు పైగా గరిష్ఠ ధర రాగా మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌ లో ఇందూరు రైతుకు రూ.20వేలకు పైగా ధర లభించింది. ఈ సీజన్​లో నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో దాదాపు వెయ్యి కోట్ల లావాదేవీలు జరిగాయి. విస్తీర్ణం తక్కువైనా అధిక ధరలు రావడం పట్ల రైతులు సంతోషంలో మునిగిపోయారు.

Turmeric Price Hits High In Nizamabad
Turmeric Price Hits High In Nizamabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 10:45 AM IST

రికార్డు స్థాయిలో పెరిగిన పసుపు ధర నిజామాబాద్ మార్కెట్​యార్డులో వెయ్యి కోట్ల లావాదేవీలు (ETV Bharat)

Turmeric Price Hits High In Nizamabad : దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ సీజన్‌లో సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గినా కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న నిర్మల్, జగిత్యాల నుంచి సరుకు భారీగా వచ్చింది. అక్కడ స్థానికంగా మార్కెట్ ఉన్నప్పటికీ నిజామాబాద్ యార్డులో ఈ సారి గిట్టుబాటు ధర రావడంతో రైతులు ఇక్కడికి వచ్చేందుకే మొగ్గు చూపారు. దాదాపు పసుపు పంట విక్రయాలు పూర్తి కాగా ఈ సీజన్ రైతులకు ఆశాజనకంగా ముగిసింది.

పసుపు క్వింటాకు రూ.10 వేలు వస్తే గగనమనుకునే స్థాయికి దిగజారడంతో జిల్లాలో 36వేల ఎకరాలు సాగయ్యే విస్తీర్ణం కాస్త 25 వేలకు తగ్గిపోయింది. గతేడాది వరకు క్వింటా నమూనా ధర రూ.6వేల 500కి మించకపోడంతో రైతులు సాగుపై ఆశలు వదిలేశారు. అయితే అనూహ్యంగా జులై నుంచి పసుపు ధర ఎగబాకింది. ఏకంగా గరిష్ట ధర రూ.18 వేలు దాటింది. చివరివరకు ఇదే ఊపు కొనసాగింది. సగటున రూ.10 వేల 960 దక్కి పసుపురికార్డు సృష్టించింది. ఈ సీజన్లో 9లక్షల 59వేల 743 క్వింటాళ్లకు ఒక వెయ్యి 7కోట్లకు పైగానే లావాదేవీలు జరిగాయి. ఇందులో ఇందూరు జిల్లా రైతుల వాటా 5లక్షల 50వేల క్వింటాళ్లయితే రూ.577 కోట్ల 50 లక్షల లావాదేవీలు జరిగాయి.

ఆల్​టైం రికార్డుగా మారిన పసుపు ధర - ఆనందంలో అన్నదాతలు

Turmeric Prices Hike In Telangana : ఉమ్మడి జిల్లాకు గుండెకాయగా ఉన్న నిజామాబాద్ వ్యవసాయ యార్డు ద్వారానే మార్కెటింగ్ శాఖకు అత్యధిక ఆదాయం వస్తోంది. వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై ఒక శాతం కమీషన్ రూపంలో మార్కెట్ ఖజానాకు చేరుతుంది. ఒక్క పసుపు పంట ద్వారానే రూ.10 కోట్ల వరకు మార్కెట్‌కు ఆదాయం సమకూరనుంది. వాస్తవానికి మూడేళ్లుగా పసుపుసాగు, దిగుబడులు తగ్గడంతో మార్కెట్‌ యార్డు ఆదాయంపై ప్రభావం పడింది. ఈసారి ధర ఆశాజనకంగా ఉండటంతో లావాదేవీలు భారీగా జరిగాయి. రైతులకు గిట్టుబాటు ధర లభించింది.

"గతేడాదితో పోల్చుకుంటే మార్కెట్​కు 40శాతం పంట తక్కువ వచ్చింది. పంట తక్కువ వచ్చిన పంటకు ధర మంచిగా పలకడంతో రైతులు ఆనందంతో ఉన్నారు. ఎప్పటికంటే ఈ సారి పసుపు పంటకు అత్యధికంగా ధర లభించింది. వచ్చే ఏడాది కూడా పంట దిగుబడి ఇలాగే ఉంటే ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉంది." - విజయ్ కిషోర్, సెలక్షన్‌ గ్రేడ్‌ అధికారి

ప్రతి ఏటా రూ.5వేల కంటే ధర తక్కువే లభించేంది. అలాంటింది దశాబ్ధంన్నర తర్వాత సగటు ధర రూ.10వేలు దాటగా కనిష్ఠ ధర సైతం 8వేల పైనే రైతులకి లభించింది. నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డుకు అధిక ఆదాయం వస్తున్నా ఏటా ఇతర మార్కెట్లకు నిధులు తరలిస్తారన్న ఆరోపణ ఉంది. ఈసారైనా యార్డుకు వచ్చిన ఆదాయాన్ని ఇతర మార్కెట్లకి మళ్లించకుండా నిజామాబాద్‌ మార్కెట్‌లో వసతుల కల్పనకు వెచ్చించాలని రైతులు కోరుతున్నారు.

Turmeric price: గిట్టుబాటు ధర రాక.. అమ్మలేక.. ఆరేళ్లుగా ఆరైతు?

Turmeric Price Hike in Warangal : పసుపు ధరకు రెక్కలు.. ప్రస్తుతం క్వింటాకు రూ.13వేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.