ETV Bharat / state

అతి త్వరలో రైతు రుణమాఫీపై శుభవార్త : తుమ్మల - raithu runa mafi in telangana

Tummala Latest Comments on Raithu Runa Mafi : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. త్వరలో రుణమాఫీ విషయంలో రైతాంగానికి శుభవార్త చెప్పనున్నట్లు స్పష్టం చేశారు.

Raithu Runa Mafi in Telangana
Tummala Latest Comments on Raithu Runa Mafi
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 8:06 PM IST

Tummala Latest Comments on Raithu Runa Mafi : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ విషయంలో రైతాంగానికి శుభవార్త ప్రకటించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్​లో ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 8వ జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన రైతులకు ఒకేసారి రూ.2 లక్షల (2 Lakhs Runa Mafi) విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మాట నిలుపుకుంటుందని చెప్పారు. సహకార బ్యాంకులపై భారం పడకుండా ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ విషయమై అన్ని బ్యాంకులు మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం ఎప్పుడు తోడ్పాడు అందిస్తుందని పేర్కొన్నారు.

రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం కసరత్తు - మార్చి మొదటి వారంలోనే!

Raithu Runa Mafi in Telangana : కార్పొరేట్​ రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రోత్సహిస్తున్నారని సదస్సులో పాల్గొన్న సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మిగిలిన సెక్టార్లను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగా పీఠికను ధ్వంసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కోఆపరేటివ్​ బ్యాంకులను బతికించడానికి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోఆపరేటివ్​ వ్యవస్థను బలోపేతం చేయడానికి గొప్ప నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై మంత్రి తుమ్మల (Minister Tummala) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దానికి వారు స్పందించి ప్రభుత్వంతో చర్చించి, పరిశీలిస్తామని చెప్పినట్లు వివరించారు.

"తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలో అతి త్వరలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం రైతు రుణమాఫీపై త్వరలోనే శుభవార్తను రైతాంగానికి అందిస్తాము. బ్యాంకులన్నింటీని బలోపేతం చేసి రైతులకు మరింత సేవలు చేసే విధంగా మద్దతు ఇస్తాం. ప్రభుత్వం కార్యక్రమాలు ఎలా చేపట్టాలో అన్ని చేస్తాం. బ్యాంకులు ఒక్క రూపాయి కూడా నష్ట పోవద్దు. మేము ఆ బాధ్యత తీసుకుంటాము." - తుమ్మల నాగేశ్వర రావు, వ్యవసాయ శాఖ మంత్రి

రైతులకు గుడ్​న్యూస్ - ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్

కార్పొరేట్, ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న పెన్షన్ విధానాన్ని కోపరేటివ్ బ్యాంకులో కూడా అమలు చేయాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి రాంబాబు డిమాండ్ చేశారు. కోపరేటివ్​లో టూ టైర్ విధానం అమలు చేయడం వల్ల రైతులకు నాలుగు శాతం వడ్డీలో మినహాయింపు ప్రయోజనాన్ని ఎవరు పట్టించుకోవడంలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. దీనిపై తుమ్మల నాగేశ్వర రావు పరిశీలిస్తామన్నారని చెప్పారు. అలాగే కోపరేటివ్​ బ్యాంకు ఉద్యోగుల పెన్షన్​పై చర్చలు జరుగుతున్నట్లు రాంబాబు తెలిపారు.

అతి త్వరలో సీఎం నాయకత్వంలో రైతు రుణమాఫీపై శుభవార్త తుమ్మల

త్వరలోనే కర్షకులకు రుణమాఫీ - కౌలుదారులకు రైతుబంధు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.