ETV Bharat / state

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి - టీఎస్‌పీఎసీ ఛైర్మన్​ మహేందర్‌రెడ్డి

TSPSC New Chairman 2024 : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది దీంతో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యుల నియామకానికి గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. గత ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలను న్యాయ సలహా అనంతరం ఆమోదించిన గవర్నర్‌, తాజాగా ప్రభుత్వ సిఫార్సులకు ఆమోదముద్ర వేయగా, గణతంత్ర దినోత్సవం రోజు బాధ్యతలు చేపట్టారు.

Mahender Reddy
Mahender Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 2:15 PM IST

Updated : Jan 26, 2024, 12:56 PM IST

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి

TSPSC New Chairman EX DGP Mahender Reddy : రాష్ట్రంలో పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలు సహా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస వివాదాల్లో చిక్కుకున్న తరుణంలో బోర్డు ప్రక్షాళన దిశగా రేవంత్‌రెడ్డి( CM Revanth Reddy) ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పోటీ పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు, ఛైర్మన్‌ బాధ్యతలను మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డికి(EX DGP Mahender Reddy) అప్పగించారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై ఆమోదముద్ర వేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు.

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి - మనోజ్​ సోనితో సీఎం రేవంత్​ రెడ్డి

TSPSC New Board 2024 : గత ప్రభుత్వ హయాంలో ఉన్న బోర్డు ఛైర్మన్‌(TSPSC Board New Chairman) బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులు ఆర్‌.సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి, బండి లింగారెడ్డిలు డిసెంబర్‌లో రాజీనామా చేయగా కొత్త ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకోగా చివరికి మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేస్తూ దస్త్రాన్ని గవర్నర్‌కు పంపించారు. ప్రభుత్వ సిఫార్సుల మేరకు గవర్నర్‌ తమిళిసై మహేందర్‌రెడ్డి నియామకానికి ఆమోదం తెలిపారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించి, జాతాయ పతాకాన్ని ఆవిష్కరించారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా - అశోక్​నగర్​లో నిరుద్యోగుల సంబురాలు

TSPSC New Board Members 2024 : మహేందర్ రెడ్డిని ఛైర్మన్‌గా మరో ఐదుగురిని సభ్యులుగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం జీవో జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారిణి అనితా రాజేంద్రన్, భారత తపాల సర్వీసుల్లో పనిచేసిన విశ్రాంత అధికారి అమీర్ ఉల్లా ఖాన్, ప్రొఫెసర్ నర్రా యాదయ్య, యరబడి రామ్మోహన్ రావు, పాల్వాయి రజనీలను సభ్యులుగా నియమిస్తున్నట్టు ప్రకటించింది. దీంతా వారు బాధ్యతలు స్వీకరించారు. ఆరు ఏళ్ల కాలానికి లేదా 62 ఏళ్లు వచ్చే వరకు వారు ఆ పదవుల్లో కొనసాగుతారని స్ఫష్టం చేసింది.

TSPSC New Chairman Details : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామానికి మహేందర్‌రెడ్డి చెందిన వారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 1986లో సివిల్ సర్వీసు సాధించారు. వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేశారు. దిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. రామగుండం ఏఎస్పీగా తొలుత బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిజామాబాద్‌, కర్నూలు ఎస్పీగా పనిచేశారు. ఐదేళ్లపాటు జాతీయ పోలీసు అకాడమీలో అనంతరం, సైబరాబాద్‌ కమిషనరేట్‌కు మొదటి కమిషనర్‌గా నియమితులయ్యారు. గ్రేహౌండ్స్‌, పోలీసు కంప్యూటర్స్‌ విభాగాల్లో విధులు నిర్వహించటంతో పాటు, కీలకమైన నిఘా విభాగాధిపతిగానూ పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌ కమిషనర్‌గా(Mahendar Redday as a Hyderabad Commissioner) నియమితులయ్యారు. 2017 నవంబర్‌లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌ రెడ్డి 2022 డిసెంబర్‌ వరకు ఆ పదవిలో కొనసాగారు.

TSPSC Member Narri Yadayah : టీఎస్​పీఎస్సీకు ఎంపికైన సభ్యుడు జేఎన్​టీయూలో సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ నర్రి యాదయ్య యాదాద్రి జిల్లా సర్వేల్​కి చెందిన వారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో పీహెచ్​డీ పూర్తి చేశారు. ఎస్​ఎస్​ఐ నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడల్, ఉత్తమ అధ్యాపక అవార్డు, ఇంజినీర్ ఆఫ్​ది ఇయర్ సహా పలు అవార్డులను అందుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన యరబడి రామ్ మోహన్ రావు ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ బీఈ సివిల్ ఇంజినీరింగ్, సిక్కిం మణిపాల్ వర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 1986లో ఏఈగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జెన్ కో లో ఈడీగా చేశారు.

Palvai Rajini Kumari Details : మరో అభ్యర్థి పాల్వాయి రజినీ కుమారి సూర్యాపేటకు చెందిన వారు. ఎంఏ పూర్తి చేసిన రజినీ కుమారి 1996 నుంచి 2000 వరకు విలేజ్ డెవెల్మెంట్ అధికారిగా పనిచేశారు. 2000లో గ్రూప్ 1 సర్వీసుకు ఎంపికయ్యారు. రెండు సార్లు ఉత్తమ మున్సిపల్ కమిషనర్​గా అవార్డులు అందుకున్నారు. 2004లో సర్వీసుకి రాజీనామ చేశారు. మరో సభ్యుడు ప్రొఫెసర్ విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి, విద్యావేత్త అమీరుల్లా ఖాన్.

టీఎస్​పీఎస్సీ గ్రూప్- 2 పరీక్ష వాయిదా

Last Updated : Jan 26, 2024, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.