ETV Bharat / state

వేగంగా ఉద్యోగాల భర్తీకి టీఎస్​పీఎస్సీ చర్యలు - ఎన్నికల కోడ్ ముగియగానే మరిన్ని నోటిఫికేషన్లు! - TSPSC NOTIFICATIONS 2024 - TSPSC NOTIFICATIONS 2024

TSPSC Focused on Notifications : పారదర్శకంగా, వేగంగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్​పీఎస్సీ) చర్యలు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగియగానే మరిన్ని కొలువులు భర్తీ చేసేలా పరిపాలన కసరత్తును కమిషన్‌ పూర్తి చేస్తోంది. త్వరలో రాత పరీక్షల తుది కీల వెల్లడి, సర్టిఫికెట్ల పరిశీలనకు సమాయత్తం అవుతోంది.

TSPSC
TSPSC Focused on Notifications
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 8:00 AM IST

ఉద్యోగ నియామకాలపై టీఎస్​పీఎస్సీ కలరత్తు త్వరలో గ్రూప్​-4 ఫలితాలు

TSPSC Focused on Notifications : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తోంది. అప్పటివరకు రాత పరీక్షల తుది కీల వెల్లడి, జనరల్‌ ర్యాంకు జాబితాల ప్రకటన, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయనుంది. ఈ మేరకు రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకు18 వేలకు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జారీ చేసింది.

2023లో ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్‌-1తో (Group-1 Exam) పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయి. అనంతరం మళ్లీ నిర్వహించినా సాంకేతిక కారణాలతో ఫలితాలు వెల్లడి కాలేదు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ బోర్డును పునర్నియమించింది. కొత్త బోర్డు రెండు నెలల్లోనే మూడు నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి, 10 ఉద్యోగ ప్రకటనలకు జనరల్‌ ర్యాంకు జాబితాలు ప్రకటించింది. కొత్తగా గ్రూప్‌-1 ప్రకటన జారీ చేయడం సహా కీలకమైన గ్రూప్‌-2, 3తో పాటు డీఏవో, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు రాతపరీక్ష తేదీలు ప్రకటించింది.

టీఎస్​పీఎస్సీ గ్రూప్​ ఎగ్జామ్స్​ తేదీలు విడుదల - ఆగస్టులో గ్రూప్​2 పరీక్షలు

జనరల్‌ ర్యాంకు జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు త్వరలోనే ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనుంది. అందులో భాగంగా జిల్లా స్థాయిపోస్టులైన గ్రూప్‌-4 ఖాళీల (Group-4 Results) భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెలువరించనున్నారు. ఏఈఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తైన వెంటనే, తుది ఫలితాల వెల్లడికి కార్యాచరణ పూర్తి చేయనుంది. ఏఈ పోస్టులకు త్వరలోనే తుదికీ వెలువరించనుంది.

ఇంటర్‌ విద్యావిభాగంలో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు 2022 డిసెంబరులో ఉద్యోగ ప్రకటన జారీ కాగా 2023 అక్టోబరులో రాత పరీక్షలు పూర్తయ్యాయి. వారం, పది రోజుల్లో కీ వెల్లడించాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. రాతపరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావులేకుండా కమిషన్‌ చెక్‌ పెడుతోంది. గతంలో ప్రశ్నాపత్రం రూపొందించినప్పుడు నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇచ్చేవారు.

గ్రూప్​-1పై కీలక అడుగులు - సుప్రీంలో అప్పీలు ఉపసంహరణకు టీఎస్​పీఎస్సీ పిటిషన్‌

అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకొని, సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునేవారు. తద్వారా జాప్యంతోపాటు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ఈ తరుణంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ (Primary key) వెలువరిస్తుడటం వల్ల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు దాదాపు తగ్గిపోతున్నాయి. అప్పటికీ ఏమైనా ఉంటే మళ్లీ పరిశీలించి తుది కీ వెలువరిస్తోంది.

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.