ETV Bharat / state

అంతర్జాతీయ డ్రగ్స్​ సిండికేట్​ గుట్టురట్టు - నేరగాళ్ల సమాచారమిస్తే రూ.2 లక్షల రివార్డు - International Drugs Syndicate

International Drugs Syndicate Busted : ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్‌ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్‌ సిండికేట్‌ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో పోలీసులు ఛేదించారు. నార్సింగి పోలీసులతో కలిసి గుట్టురట్టు చేశారు. నైజీరియాలోని డ్రగ్‌ డాన్‌ ఆదేశాల మేరకు ఒక మహిళ తరచూ డ్రగ్స్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌లోని స్థానిక పెడ్లర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శివారు ప్రాంతమైన నార్సింగిలోని ఒక ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు, నైజీరియాకు చెందిన ఇద్దరు డ్రగ్‌ డీలర్లు, కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముగ్గుర్ని అరెస్టు చేశారు.

International Drugs Syndicate Busted
International Drugs Syndicate Busted (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 7:14 AM IST

International Drugs Syndicate Busted : తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో పోలీసులు డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో ఓ ఫ్లాట్‌పై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 199గ్రాముల కొకైన్‌ను పట్టుకున్నారు. రెండు పాస్‌పోర్టులు, బైకులు, 10 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ విలువ 35లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

డ్రగ్​రాకెట్​ కీలక సూత్రధారి గుర్తింపు : నైజీరియా దేశానికి చెందిన డెవిన్‌ ఎబుకా సూజీ అలియాస్‌ ఎబుకా అలియాస్‌ లెబుకా అలియాస్‌ ఇమ్మాన్యుయేల్‌ అలియాస్‌ లెవల్‌ కీలక సూత్రధారిగా గుర్తించారు. హైదరాబాద్‌కు ఉన్నత విద్య కోసం వచ్చిన ఈయన నగరంలోని టోలిచౌకిలో ఉంటూ స్థానికంగా డ్రగ్స్‌ విక్రయించేవాడు. ఇతడు ఏడు డ్రగ్స్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తన నెట్‌వర్క్‌తో డ్రగ్స్‌ దందాలో ఆరితేరిన డెవిన్‌ దిల్లీకి మకాం మార్చాడు. ప్రస్తుతం నైజీరియాకు వెళ్లి పెద్ద సిండికేట్‌ ఏర్పాటు చేసి భారత్‌ నుంచి వచ్చే ఆర్డర్‌ ప్రకారం డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు.

నైజీరియా మహిళతో డ్రగ్స్ సరఫరా : ఇందుకోసం ప్రత్యేకంగా నైజీరియాకు చెందిన మహిళ ఒనౌహా బ్లెస్సింగ్‌ అలియాస్‌ జోవానా గోమెస్‌ అనే మహిళను నియమించుకున్నాడు. 2018లో భారత్‌కు వచ్చిన ఈమె బెంగళూరులో హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచేస్తూ నైజీరియా నుంచి దేశంలోని వివిధ నగరాలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తోంది. తన డ్రగ్స్‌ రవాణాకు ఆటంకం కలగకుండా ఆఫ్రికాలోని మరో దేశమైన గినియా బిస్సో నుంచి నకిలీ పేరుతో పాస్ట్‌పోర్టు తీసుకుంది. ఒకవేళ డ్రగ్స్‌తో పట్టుబడినా కేసుల నుంచి తప్పించుకుని నైజీరియా వెళ్లేందుకు పాస్‌పోర్టు తీసుకుంది.

Accused Brought Drugs To Hyderabad 20 Times : రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తూ డీలర్లకు సరఫరా చేసే నిందితురాలు ఒనౌహా ఇప్పటివరకూ హైదరాబాద్‌కు 20 సార్లు డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ప్రతిసారీ కనీసం 200నుంచి 300 గ్రాముల చొప్పున కొకైన్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌లోని సప్లయర్లకు విక్రయించేది. ఒక మహిళ తరచూ నైజీరియా- భారత్‌ మధ్య ప్రయాణించడం గుర్తించిన పోలీసులు ఆమెపై నిఘా ఉంచారు.

ఇదే సమయంలో డెవిన్‌ ప్రధాన అనుచరుడు లంగర్‌హౌస్‌లో ఉండే నైజీరియాకు చెందిన అజీజ్‌ నోహిమ్‌ హైదరాబాద్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విద్యార్థి వీసాపై నగరానికి వచ్చిన ఇతనిపై ఓయూ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాది బయటకొచ్చాడు.

స్థానిక డ్రగ్​ పెడ్లర్లకు సరఫరా : ఇతనికి నైజీరియాకు చెందిన లంగర్‌హౌస్‌లో నివాసముండే ఎజెనోయి ఫ్రాంక్లిన్‌ ఉచేనా అలియాస్‌ ఖలేషీతో పరిచయం ఏర్పడింది. ఖలేషీ వైద్య వీసాతో 2022లో హైదరాబాద్‌కు వచ్చాడు. ఒకే దేశానికి చెందిన వారు కావడంతో డెవిన్, ఖలేషీ, నోహిమ్‌ మధ్య పరిచయం ఏర్పడింది. డెవిన్‌ ఆదేశాల మేరకు బ్లెస్సింగ్‌ నైజీరియా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చాక ఖలేషీ, నోహిమ్‌ వాటిని హైదరాబాద్‌లోని స్థానిక పెడ్లర్లకు సరఫరా చేసేవారు.

NGNAB Busts Drugs Syndicate : బ్లెస్సింగ్‌ రాకపోకలు, ఖలేషి, నోహిమ్‌ కార్యకలాపాలపై టీజీ న్యాబ్‌ దృష్టి సారించింది. బ్లెస్సింగ్‌ సోమవారం హైదరాబాద్‌ వచ్చినట్లు గుర్తించి ఆమెను అనుసరించగా నార్సింగిలోని హైదర్షాకోట్‌లోని జనాన్‌ ఫోర్ట్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాటుకు వెళ్లింది. ఆకస్మికంగా దాడి చేసి బ్లెస్సింగ్, నోహిమ్‌తో పాటు ఏపీలోని విశాఖపట్నంకు చెందిన అల్లం సత్య వెంకట గౌతమ్‌, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన వరుణ్‌కుమార్‌, రాజేంద్రనగర్‌ బండ్లగూడ జాగీర్‌కు చెందిన కొరియోగ్రాఫర్‌ మహ్మద్‌ మహబూబ్‌ షరీఫ్‌లు పట్టుబడ్డారు.

ఫ్రాంక్లిన్, డెవిన్‌ పరారయ్యారు. పట్టుబడ్డ నిందితులు బ్లెస్సింగ్‌ దగ్గర డ్రగ్స్‌ కొని నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఉండే 13 మందికి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ధనిక కుటుంబాలకు చెందిన అమన్‌ప్రీత్‌సింగ్‌, కిషన్‌ రాతి, అనికేత్, యశ్వంత్, రోహిత్, శ్రీచరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణంరాజు, వెంకట్‌, తదితరులున్నారు. వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి కొకైన్‌ పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్​లో మరో డ్రగ్స్​ ముఠా - మైనర్​ బాలుడు సహా బీఫార్మసీ విద్యార్థి అరెస్ట్

రాష్ట్రంలో మరో 2 డ్రగ్స్ గ్యాంగుల పట్టివేత, అరెస్టైన వారిలో 21 ఏళ్ల యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.