TS ICET Notification 2024 : రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లను విద్యా మండలి ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈఏపీసెట్, లాసెట్ విడుదలవ్వగా తాజాగా ఐసెట్ షెడ్యూల్‌ని రిలీజ్ చేసింది. ఎంబీఏ(MBA), ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రోఫెసర్ తాటికొండ రమేశ్ వెల్లడించారు. మార్చి 7 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసం రూ.250తో మే 17 వరకు, రూ.500తో మే 27వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 4, 5 తేదీల్లో ఆన్లైన్లో ఐసెట్ పరీక్షలు(I CET Exam Date) జరగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షకు డిగ్రీ చదివిన విద్యార్థులు అర్హులు.
టీఎస్ ఈఏపీసెట్‌గా మారిన ఎంసెట్, మే 9 నుంచి ప్రవేశపరీక్షలు
ఐసెట్-2024 షెడ్యూల్ వివరాలు :
క్రమ సంఖ్య | అంశం | ముఖ్యమైన తేదీలు |
1 | నోటిఫికేషన్ విడుదల | మార్చి 5 |
2 | దరఖాస్తుల స్వీకరణ(ఆలస్య రుసం లేకుండా) | మార్చి 7 నుంచి ఏప్రిల్ 30 |
3 | ఆలస్య రుసం రూ.250తో దరఖాస్తు స్వీకరణ | మే 17 |
4 | ఆలస్య రుసం రూ.500తో దరఖాస్తు స్వీకరణ | మే 27 |
5 | పరీక్ష | జూన్ 4, 5 |
TS I SET Notification Schedule 2024 : టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్(I CET Notification) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిన అనంతరం tsicet.nic.in వెబ్సైట్లోకి వెళ్లి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఐసెట్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు అప్లికేషన్ నింపే ప్రక్రియలో కొన్ని దశలు ఉంటాయి. ముందుగా అభ్యర్థి ప్రాథమిక వివరాలు ఇచ్చి పరీక్ష ఫీజు చెల్లించాలి. అనంతరం లాంగిన్ ఐడీ, పాస్వర్డ్ వస్తోంది. వాటితో అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. ఇప్పటికే టీఎస్ ఈఏపీసెట్ మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్, 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. మే 6న ఈసెట్, మే 23న టీఎస్ ఎడ్‌సెట్, జూన్ 3న లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యామండలి తెలిపింది.
Engineering Seats in Telangana 2023 : రాష్ట్రంలో మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లు 16,926
జూన్‌లో ఎంసెట్, ఈసెట్ మాత్రమే.. మిగిలిన ప్రవేశ పరీక్షలు జులైలోనే..