ETV Bharat / state

'అయ్యో బిడ్డా'.. 21 రోజులు వెంటిలేటర్​పై పోరాడిన దక్కని ప్రాణం - STUDENT DIES OF FOOD POISON IN TS

గురుకులాలో ఆహారం వికటించి శైలజ విద్యార్థిని మృతి - 21రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించినా దక్కని ప్రాణం - ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విపక్షాలు

Tribal Student Dies OF Food Poison in Telangana
Tribal Student Dies OF Food Poison in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 11:54 AM IST

Updated : Nov 26, 2024, 12:22 PM IST

Tribal Student Dies OF Food Poison in Telangana : బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారి విషాహారం వల్ల మృత్యువాత పడింది. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి చేరుతుందన్న కన్నవారి ఆశలు ఆవిరయ్యాయి. అక్టోబర్‌ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో సహచర విద్యార్థులతో భోజనం చేసి శైలజ అనే విద్యార్థిని 21రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. కళ్లముందే కన్నకుమార్తె చనిపోవడంతో ఆ తల్లి పెట్టిన రోదన ఆకాశాన్నంటింది. విద్యార్థిని మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు.

హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ కుమురంభీం జిల్లా వాంకిడి ఆశ్రమపాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందింది. అక్టోబర్‌ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో తోటి విద్యార్థులతో భోజనం చేసిన శైలజ అస్వస్థతకు గురైంది. పలువురు చిన్నారులను సమీప ప్రభుత్వాస్పత్రుల్లో చేర్పించి వైద్యం అందించారు. మిగతా వారు కోలుకున్నా శైలజ పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కి తరలించారు. 21రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్సపొందుతూ విద్యార్థిని మృత్యువాత పడింది. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తిచేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తన కుమార్తె పరిస్థితి మరొకరికి కలుగకుండా చూడాలని ఆ తల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలిచివేసింది.

గురుకులంలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత - ఆరోగ్య పరిస్థితిపై మంత్రుల ఆరా - Gurukulam Students Food Poison

చేతులు దులుపుకున్న అధికారులు : బాలికలు అస్వస్థతకు గురై దాదాపు నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ అధికారులు కారణాలను వెల్లడించలేదు. ఘటన జరిగిన మరుసటిరోజు విచారణలో భాగంగా ఆహారపదార్థాల నమూనాలు సేకరించి అన్ని బాగున్నట్లు నివేదిక అందించారు. విద్యార్థినులు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాల వల్లే అనారోగ్యానికి గురయ్యారంటూ అధికారులు చేతులు దులిపేసుకున్నారనే వాదనలూ వినిపించాయి. ఘటన జరిగిన రోజే విచారణ చేపడితే బాగుండేదని విద్యార్థినుల తల్లిదండ్రులు భావించారు. కలుషితానికి గల కారణాలను అధికారులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెప్పకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విద్యాశాఖ మంత్రి లేక తిప్పలు : వాంకిడి గురుకుల విద్యార్థిని మృతికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కారణమని మాజీమంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద చదువులు చదివేందుకు గురుకులాల్లో చేరిస్తే పేద గిరిజన బిడ్డను బలి తీసుకున్నారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదన్న కేటీఆర్ ముఖ్యమంత్రికి పేదల పిల్లల బాధలు పట్టవంటూ విమర్శలు గుప్పించారు.

సహచర విద్యార్థులతో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారి విషాహారంతో కన్నుమూయటం కలిచివేసిందని హరీశ్‌రావు అన్నారు. గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం ఒక పాపమైతే అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరో పాపమంటూ ఆక్షేపించారు. ఆ గిరిజన విద్యార్థిని కుటుంబానికి అండగా ఉంటూ రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హరీశ్‌ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్​ పాయిజన్ - 24 మంది విద్యార్థులకు అస్వస్థత

ఆదర్శ పాఠశాలలోని అల్పాహారంలో బల్లి - అస్వస్థతకు గురైన విద్యార్థులు

Last Updated : Nov 26, 2024, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.