Trial Run of First Ever Seaplane Service in Punnami Ghat Vijayawada : పర్యాటక రంగంలో మరో అద్భుతం ఆవిష్కరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 9న విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్ల్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం జలాశయం వద్ద సీ ప్లేన్ ల్యాండింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు. సీ ప్లేన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈనెల 9న విజయవాడ పున్నమి ఘాట్ వద్ద నుంచి సీప్లేన్ ప్రారంభించి సీఎం చంద్రబాబు శ్రీశైలం వస్తారని చెప్పారు. శ్రీశైలం జలాశయం ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిసర జలాల్లో సీ ప్లేన్ ల్యాండ్ అవుతుందన్నారు. సీ ప్లేన్ నుంచి సీఎం వచ్చిన తర్వాత రోప్ వే ద్వారా పైకి వచ్చి ఆలయానికి చేరుకుంటారన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న తర్వాత సీఎం సీప్లేన్లో విజయవాడ వెళ్తారని తెలిపారు.
విజయవాడ నుంచి శ్రీశైలం నుంచి విజయవాడ (Vijayawada to srisailam To Vijayawada) మధ్య సీ ప్లేన్ నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసు ప్రారంభించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండోదశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలు రూపొందిస్తోంది.
ఇటీవల జాతీయస్థాయి డ్రోన్ సమిట్ నిర్వహించగా ఇప్పుడు సీ ప్లేన్ ప్రయోగం చేస్తున్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇందుకు ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు.
నాగార్జునసాగర్-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం - ప్యాకేజి వివరాలివే
కూటమి ప్రభుత్వంలో మళ్లీ కదలిక వచ్చింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగా సీ ప్లేన్ ప్రయోగం చేస్తున్నాయి. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. ప్రయోగం విజయవంతమయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండోదశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి.
చాలెంజ్ : "బాహుబలి గ్రాఫిక్స్‌ను మించిపోయేలా!" - మీ కళ్లను మీరే నమ్మలేరు!