ETV Bharat / state

'బండెనక బండి కట్టి - పదహారు బండ్లు కట్టి' - ఊరుఊరంతా మేడారం జాతరకు - medaram jathara 2024

Travelling on Bullock Cards To Medaram Jatara : సమ్మక్క జాతరకు ఎండ్ల బండ్లలో వెళ్లడమే వారి సంప్రదాయం. ఇప్పటి కాలంలో రవాణా పరంగా ఎంత అభివృద్ది చెందినా, తమ ఆచారాన్ని గట్టిగా అనుసరిస్తున్నారు. ఏకంగా ఊరుఊరంతా సమ్మక్క- సారలమ్మ జాతరకు ఎండ్లబండ్లలోనే వెళుతున్నారు. ఆ గ్రామం వాసులు ఏం అంటున్నారో చూడండి.

Bullock Cards Special Attraction in Medaram Jatara
Travelling on Bullock Cards To Medaram Jatara
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 12:58 PM IST

బండి వెనుక బండి కట్టే పదహారు బండ్లు కట్టి మేడారం జాతరకు పోదాం అంటున్న వెంకటాపురం గ్రామవాసుల కథ తెలుసా

Travelling on Bullock Cards To Medaram Jatara : ములుగు జిల్లాలో అత్యంత ఘనంగా జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. చాలా మంది బస్సుల్లో, వాళ్ల సొంత వాహనాల్లో లేక రైళ్లలో వస్తారు. కానీ ఈ గ్రామస్థులు మాత్రం కేవలం ఎడ్ల బండిపైనే వస్తాం అంటున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియా ఖండంలోనే అత్యంత ఘనంగా జరిగే సమ్మక్క -సారాలమ్మ జాతరకు దేశ వ్యాప్తంగా భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఇప్పటి కాలంలో ఎక్కడికైనా వెళ్లాలి అంటే కారు, బస్సు లేక ఇతర వాహనాలు తీసుకుని వెళ్తున్నారు. పక్క సందులో గుడైనా వాహనాల్లో వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు. అలాంటిది గిరిజన ప్రాంతంలో ఉండే ఈ జాతరకు 100లో 99 శాతం మంది కార్లు, ఇలాంటి వాటికే ప్రిఫరెన్స్​ ఇస్తారు. కానీ ఈ కాలంలో కూడా ఎడ్లబండిపై వెళ్లేవారుంటారా అంటే అవుననే చెప్పాలి. అందుకు నిదర్శనం ఈ గ్రామస్థులే.

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పదేళ్లుగా కోరుతున్నాం: సీతక్క

Bullock Cards Special Attraction in Medaram Jatara : సమ్మక్క సారలమ్మ జాతర జరిగినప్పుడల్లా ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం కేంద్రం ప్రజలు ఎండ్లబండి కట్టుకుని వెళ్తారంటా. ఈ విషయమై అడిగితే, పూర్వంలో తాతముత్తాల నుంచి ఈ జాతరకు ఎండ్ల బండి కట్టుకుని ఆచారంగా పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా కలిసి వస్తున్నామని భక్తులు అంటున్నారు. తాము ఇప్పటికీ అదే అనుసరిస్తున్నామని చెబుతున్నారు. మేడారం జాతర అంటేనే ఎడ్లబండ్ల జాతర అని ఒకప్పుడు ఉండేదని, వరంగల్​, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచే కాకుండా ఛత్తీస్​గఢ్​ నుంచి కూడా వేలాది మంది భక్తులు ఎడ్ల బండి కట్టుకుని గోదావరి దాటి వచ్చేవారని వివరిస్తున్నారు.

"మాది ములుగు వెంకటాపురం. మా తాతల కాలం నుంచి మేడారం జాతరకు ఎడ్లబండ్లలో వెళ్లడం మా సంప్రదాయం. 2 సంవత్సరాలకు ఒకసారి మా గ్రామంలో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయో, అందరం కలిసి సంప్రదాయ బద్దంగా ఇలా ఎడ్ల బండ్లలో జాతరకు వస్తుంటాం. కార్లల్లో, జీపుల్లో, ట్రాక్టర్లలో రావడం ఉండదు మాకు. ఈ దేవత అంటే మాకు అభిమానం. ఈ జాతరకు రావడం చాలా సంతోషం." - వెంకటాపురం వాసి

మేడారం వీరవనితలు సమ్మక్క సారలమ్మల ఖ్యాతి చాటేలా కళాకారుడి పాట

"మేము వెనకటి నుంచి ఎడ్లబండ్లలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తున్నాం. అప్పటి నుంచి ఈ ఆచారం ఉంది. అందుకే దానిని తప్పకుండా అనుసరిస్తాం. ఇలా వెళ్తేనే అమ్మవారు మాకు దీవెనలు ఇస్తారని మా నమ్మకం. ఇలా ఎండ్లబండ్లలో జాతరకు వెళ్తే ఆనందంగా ఉంటుంది. అందుకే ఇప్పటివరకు ఈ ఆచారాన్ని మేము తప్పలేదు." - గ్రామస్థులు

మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తాం : మంత్రి పొంగులేటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.