ETV Bharat / state

పోలీస్ శాఖలో వరుస బదిలీలు - కేసుల దర్యాప్తులో తగ్గుతోన్న పురోగతి - Police Transfers Affecting cases

Transfers in Police Department Affecting Investigation of Cases : పోలీస్ శాఖలో బదిలీలు కేసుల దర్యాప్తుపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. ఆ శాఖలో పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ వరుసగా స్థానచలనం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్​ ఇచ్చిన ఉత్తర్వులు మరోసారి బదిలీలు అయ్యేందుకు ఆస్కారం ఉంది.

Transfers in Police Department
Transfers in Police Department Affecting Investigation of Cases
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 9:49 AM IST

Transfers in Police Department Affecting Investigation of Cases : పోలీస్ శాఖలో వరుస బదిలీలు తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఒక సబ్​ డివిజన్​ పరిధిలో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు ఒకేసారి మారుతుండటంతో తలనొప్పిగా మారింది. ఎందుకంటే కేసుల దర్యాప్తుపై ఈ స్థానచలనాలు ప్రభావం చూపుతున్నాయి. కొత్తగా నమోదయ్యే కేసులతో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ సగం దర్యాప్తు పూర్తయిన పాత కేసుల విషయంలోనే చిక్కుముడి వచ్చి పడింది. దీంతో పోలీసుల రోజువారీ కార్యకలాపాలకూ ఇబ్బంది ఏర్పడింది.

గత ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికల(Assembly Elections 2023) సందర్భంగా ఎన్నికల కమిషన్​ నిబంధనల ప్రకారం పోలీసు శాఖలో పెద్దఎత్తున బదిలీలు జరిగాయన్ని విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు కాగానే అంతకు ముందు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారి అందరినీ మార్చేశారు. మళ్లీ ఇంతలో పార్లమెంటు ఎన్నికల(Lok Sabha Polls 2024) నేపథ్యంలో మరోమారు ఎన్నికల కమిషన్​ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్గకాల ప్రకారం కూడా మరిన్ని బదిలీలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలలో దాదాపు 90 శాతం మంది వరకు బదిలీలు పొందారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మళ్లీ ఉండనున్న బదిలీలు : అయితే పోలీసు శాఖలో బదిలీ(Police Tranfers)లు మామూలే అయినా ఒక్కసారిగా ఇంత మంది మారుతుండటం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు చూసుకుంటే ఏదైనా ఒక కేసు నమోదైతే ఆ వివరాలు సంబంధిత ఎస్సై, సీఐ, డీఎస్పీలకు తెలుస్తాయి. ఆ కేసులో ముఖ్యమైన కేసు అయితే పైస్థాయి వరకు వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఎస్సై, సీఐ, డీఎస్పీలలో ఒకరు బదిలీ అయినా మిగిలిన వారు కొత్తగా వచ్చిన వారికి కేసు వివరాలను వివరిస్తూ సహాయం చేస్తారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకుండా చాలా వరకు అధికారులంతా మారిపోయారు.

రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులు, 21 మంది నాన్ కేడర్ ఎస్పీల బదిలీ

Police Department Transfers in Telangana : ఉదాహరణకు చూసుకుంటే కుషాయిగూడా ఏసీపీ రవీందర్​, సీఐ ప్రవీణ్​ ఇద్దరూ బదిలీ అయ్యారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన బదిలీల్లో మల్కాజిగిరి డీసీపీ జానకీ ధరావత్​ను మార్చి ఆమె స్థానంలో పద్మజను నియమించారు. పార్లమెంటు ఎన్నికల నియామవళి ప్రకారం రాచకొండ కమిషనర్​ సుధీర్​బాబును మరోచోటుకు మార్చారు. దీంతో పై ఉన్న కమిషనర్​ నుంచి కింద ఉన్న సీఐ వరకు అధికారులంతా బదిలీ అయినట్లు అయింది. ఇదే విధంగా చాలా సబ్​డివిజన్లు, పోలీసుస్టేషన్లలో ఇదే పరిస్థితి తలెత్తింది.

కొత్తగా వచ్చిన వారు దర్యాప్తులో ఉన్న కేసులను పరిశీలించి, మిగిలిన దర్యాప్తు పూర్తి చేసి, అర్థం చేసుకోవడానికి, అభియోగపత్రాలు దాఖలు చేయడానికి తగిన సమయం పడుతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాత కేసుల దర్యాప్తులో వేగం తగ్గింది. ఇదిలా ఉండగా పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా రెవెన్యూ జిల్లా కాకుండా పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా తీసుకోవాలని ఇటీవల ఎన్నికల కమిషన్​ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి భారీగా బదిలీలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇవి కేసుల దర్యాప్తుపై తీవ్ర ప్రభావమే చూపనున్నాయి.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరికొంత మంది పోలీసుల బదిలీ - కారణమిదే!

పోలీసుశాఖలో సంచలనం.. 91 మంది అధికారుల స్థానచలనం.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే తొలిసారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.