Trains Stopped At Uppal Railway Station : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పలు రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్ నుంచి నాగ్‌పుర్ వెళ్లే వందే భారత్, దిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు అరగంట పాటు నిలిచిపోయాయి. సిర్పూర్ కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు గంటన్నర పాటు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఉప్పల్ స్టేషన్‌లో సింగరేణి ప్యాసింజర్ 20 నిమిషాలుగా ఆగిపోయింది. మెయిన్‌లైన్‌లో గూడ్స్ రైలు కూడా ఆగింది. మరోవైపు సిగ్నలింగ్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్వోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోకపోడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు వైపులా గేట్లు తెరుచుకోకపోవడంతో హుజురాబాద్ చుట్టుపక్కల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పరకాల వెళ్లే ప్రయాణికులు గేటు దాటి అవతల ఉన్న బస్సుల్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు. హుజురాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇవతల వైపుకు వచ్చి వారి గమ్యస్థానాలకు వెళ్తున్నారు. రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మీరు ప్రయాణించే రైలు ఆలస్యంగా వెళ్తుందా? - ఇలా చేస్తే నష్టపరిహారం పొందొచ్చు!
పేరుకు మాత్రమే స్పెషల్ ట్రైన్లు - గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లు