ETV Bharat / state

సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? - అయితే ఎస్బీఐ వద్దకు వెళ్లండి! - SBI FREE TRAINING TO WOMEN

ఎస్బీఐ ఆధ్వర్యంలో మహిళలకు పలు విభాగాల్లో శిక్షణ - సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు సహకారం

SBI Rural Self Employment Training Institutes For Women
SBI Rural Self Employment Training Institutes For Women (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 4:03 PM IST

SBI Rural Self Employment Training Institutes For Women : ప్రస్తుత తరుణంలో మహిళలను బయటకు పంపించాలంటే భయపడాల్సిన రోజులివి. అయితే ఆ యువతులు అందుకు పూర్తిగా భిన్నం. ఎస్​బీఐ ఆధ్వర్యంలో "గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ"లో శిక్షణపొంది ఉపాధి వైపు పరుగులు పెడుతున్నారు. మగ్గం, కారు డ్రైవింగ్‌, కుట్టు మిషన్‌, అల్లికలు వంటి విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. నెల రోజుల పాటు జరిగే శిక్షణలో మెలుకువలు నేర్చుకొని సొంతంగా వ్యాపారం చేసుకుంటామంటున్న మహిళలపై ప్రత్యేక కథనం.

మహిళలకు శిక్షణ : ప్రస్తుత సమాజంలో మహిళలు రాత్రి సమయాల్లో ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి. అలాంటి తరుణంలో జిల్లా కలెక్టర్‌ చొరవతో మహిళలకు క్యాబ్‌లు అందుబాటులోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండదనే ఆలోచనతో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

సంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మేహిళలు పురుషులకు ఏ మాత్రమూ తీసిపోమంటూ నిరూపిస్తున్నారు. స్వయం ఉపాధి శిక్షణ పొంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతూ అందరి మన్నలు పొందుతున్నారు. మగ్గం, కుట్టుమిషన్‌, అల్లికలతో పాటు డ్రైవింగ్‌ శిక్షణలో రాటు తేలుతున్నారు.

ఇక్కడ శిక్షణ పొందుతున్న యువతుల్లో దాదాపు అందరూ డిగ్రీలు పూర్తి చేసి ఏదో ఒక కొలువు కోసం ఎదురు చూస్తున్నవారే. అయితే "గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ" ఆధ్వర్యంలో ఉచిత భోజన, వసతి కల్పించి ఉపాధిని కల్పించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో చేరి స్వతహాగా తమ కాళ్లపై తాము నిలబడగలము అనే స్థాయికి వెళ్లే విధంగా ఇక్కడ శిక్షణ ఉంటుందంటున్నారీ మహిళలు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా ఇంటి వద్దే డబ్బు సంపాధించుకునే విధంగా శిక్షణ తీసుకుంటున్నామన్నారు.

కార్లు కొనుగోలు చేసుకుంటాం : ప్రస్తుతం ఇక్కడ నాలుగు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. కోర్సును బట్టి కాల పరిమితి ఉంటుంది. ఇప్పటి వరకు 35 మంది యువతులు కారు డ్రైవింగ్‌ శిక్షణ పూర్తి చేశారు. డ్రైవింగ్‌ నేర్చుకున్న మహిళలకు ఫీల్డ్‌లో క్యాబ్‌ నడపే అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తే కార్లు కొనుగోలు చేసుకుంటామని వారు చెబుతున్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు డ్రైవింగ్‌ అనే కోర్సును సరికొత్త విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. క్యాంటీన్లూ, బ్యాటీపార్లర్లు, మిల్క్‌ పార్లర్లు వంటి ఉపాధి కల్పిస్తూ మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని కలెక్టర్‌ క్రాంతి ఆకాంక్షించారు. ఏదైనా చేయాలన్న తపన మనలో ఉంటే అది ఎంతటి కష్టమైన పనైనా సులువుగా మారుతుందని చెబుతున్నారీ మహిళలు. కృషి, పట్టుదల ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించారు.

తక్కువ మొత్తంతో ఎక్కువ లాభం- 'SBI లఖ్​పతి' స్కీమ్​తో లక్షాధికారి అవ్వడం గ్యారెంటీ- నెలకు ఎంత కట్టాలంటే?

ఫ్రీగా 'SBI ఉన్నతి' క్రెడిట్ కార్డ్- నాలుగేళ్ల వరకు నో ఫీజు- బోలెడు బెనిఫిట్స్ కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.