Hyderabad Traffic Restrictions For Bonalu Procession : సింహవాహిని అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు నుంచే చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆదివారం వేకువజామున 4 గంటలనుంచే ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు అమలులో ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆ సమయంలో లాల్‌దర్వాజా నెహ్రు విగ్రహం నుంచి సింహవాహిని ఆలయం వైపు వాహనాలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. హిమాయత్‌పుర, షంషీర్‌పురా నుంచి వచ్చే వాహనాలు లాల్ దర్వాజ ఆలయం వైపు కాకుండా నాగులచింత వైపు వెళ్లాలని సూచించారు. చాంద్రాయాణగుట్ట, ఉప్పుగూడ నుంచి వచ్చే వాహనాలు సైతం లాల్‌దర్వాజ వైపు రాకుండా చత్రినాఖ అవుట్ పోస్ట్ వైపు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.
సింహవాహిని అమ్మవారి బోనాల జాతర : ఆదివారంతో పాటు సోమవారం రోజున కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్ నుంచి వచ్చేవి, జహానుమా, తాడ్‌బంద్, మిస్రిగంజ్, కిల్వత్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఇంజిన్ బౌలీ నుంచి వచ్చే వాహనాలు షంషీర్ గంజ్ మళ్లిస్తామన్నారు. పంచమొహల్లా నుంచి వచ్చే ట్రాఫిక్ నాగులచింత వైపు కాకుండా హరిబౌలి, ఓల్గా హోటల్ వైపు వెళ్లాలని సూచించారు.
చాంద్రాయాణగుట్ట నుంచి వచ్చే వాహనాలు, సాలార్‌జంగ్ మ్యూజియం వైపు కాకుండా ఎస్జే రోటరీ, మీర్ చౌక్, మొఘల్ పురా నుంచి వచ్చే వాహనాలు మిర్‌కాదైరా వైపు వెళ్లాలని సూచించారు. ఖిలావత్ గ్రౌండ్ నుంచి వచ్చే వాహనాలు, హిమాయత్‌పుర వైపు కాకుండా ఫతే దర్వాజ, మిస్రిగంజ్ వైపు వెళ్లేలా చర్యలు చేపట్టారు. పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
అత్యవసర సంప్రదింపులకై ప్రత్యేక నెంబర్ : అలియాబాద్ నుంచి వచ్చే వాహనదారులు షా అలీ బండా పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న దేవి ఫ్లైవుడ్ వద్ద, హరిబౌలి, గౌలిపుర నుంచి వచ్చేవారు ఆర్యవైశ్యమందిర్‌తో పాటు నాగులచింత ఆల్కా థియేటర్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో పెట్టుకోవాలని తెలిపారు. మూసబౌలి, మీర్ చౌక్ నుంచి వచ్చేవారు చార్మినార్ బస్ టెర్మినల్ వద్ద, సోమవారం రోజు ఏనుగు యాత్రలో పాల్గొనే భక్తులు దిల్లీ గేట్ వద్ద సింగిల్‌లైన్‌లో పార్క్ చేసుకోవాలని వెల్లడించారు.
గుల్జార్ హౌస్, చార్మినార్ మోనుమెంట్, చార్మినార్ బస్ టెర్మినస్, హిమాయత్‌పుర, నాగులచింత, అలియాబాద్ మీదుగా మదీనా ఎక్స్‌రోడ్, ఇంజిన్‌బౌలీ వరకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. భక్తులు ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ మేరకు సహకరించాలని కోరుతున్నారు. ప్రయాణ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే, 9010203636 నెంబర్‌కు సమాచారం అందించాలని కోరుతున్నారు.
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ - మళ్లీ రెండు రోజులు వైన్స్ బంద్! - Wines To Be Closed For Two Days