Gandikota Tourism Center In AP: ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట పర్యాటకులకు స్వర్గధామం. గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పేరొందింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కనీస సౌకర్యాలకు నోచుకోక పర్యటకులు ముప్పుతిప్పలు పడ్డారు. ఇక్కడ సదుపాయాలు మెరుగుపడతాయి అనుకుంటే కొత్త నిబంధనలు భారాన్ని మోపుతున్నాయి. కొత్తగా టోల్గేట్ వసూళ్లు చేస్తున్నారు. టికెట్లపై అధికారుల సంతకం ఉండదు. వాహనాలకో రేటు, మనుషులకో రేటు విధించి వసూలు చేస్తున్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది, ఎవరికి ఖర్చు పెడుతున్నారో చిదంబర రహస్యంగా మారింది.
ప్రవేశ రుసుం వసూలు: ప్రముఖ పర్యటక కేంద్రాల్లో గండికోట ఒకటి. పురాతనమైన కట్టడాలు, ఆహ్లాదకర వాతావరణం పర్యటకులను కట్టిపడేస్తాయి. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యటకులు ఇక్కడకు వస్తుంటారు. సెలవులు, శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని అదనుగా ఆసరాగా తీసుకున్న కొద్దిమంది వ్యక్తులు ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారు. గండికోటకు కిలో మీటరు దూరంలో టోల్గేట్ తరహాలో స్థావరాన్ని ఏర్పాటు చేసి డబ్బులు రాబడుతున్నారు.
లంబసింగిలో ఆకట్టుకుంటున్న అందాలు.. తరలివచ్చిన పర్యటకులు
టోల్ వసూలు: గండికోటను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యటకులు వస్తుంటారు. కోటలో ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో పర్యాటకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని వాపోతున్నారు. టోల్గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసేటప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించాలని పర్యటకులు డిమాండ్ చేస్తున్నారు.
స్వర్గాన్ని నేరుగా చూస్తున్నామంటున్న యువత - తెల్లవారకముందే అక్కడికి చేరుకుంటేనే!
''టూరిస్టు ప్రాంతం అని చెప్పి స్కూలు పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చాం. కానీ ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు. నడుస్తుంటే కాలికి రాళ్లు గుచ్చుకోవడంతో పిల్లలు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రోడ్లు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది''- సందర్శకులు
''ఇక్కడకి వచ్చేవారికి సరైన మౌలిక సౌకర్యాలు లేవు. రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవి కాకుండా కొత్తగా ప్రవేశ రుసుం అని చేప్పి వాహనానికి రూ. 30 చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ టోల్గేట్ వసూలును ఆపాలి.''- విద్యార్థులు
వాస్తవానికి గండికోట ప్రాంతం పురావస్తు శాఖ పరిధిలో ఉంది. అయితే ప్రవేశ రుసుం, పార్కింగ్ వసూలుకు పర్యటక శాఖ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. జిల్లా పర్యటకశాఖ అధికారులు అనుమతిచ్చారని స్థానికులు డబ్బులు వసూలు చేయడం ఏమిటని పర్యటకులు ప్రశ్నిస్తున్నారు. టోల్ వసూలును నిలిపివేయాల్సిందిగా పర్యటకుల డిమాండ్ చేశారు.
అరకులో పర్యాటకులకు కొత్త అనుభూతి - త్వరలో పారాగ్లైడింగ్ - PARAGLIDING ARRANGEMENT IN ARAKU