Tourist Faced Problems for Papikondalu Tour : గణతంత్ర దినోత్సవంతో కలిపి వరుసగా సెలవులు రావడంతో పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఏజెంట్లు బోట్ల స్థాయికి మించి అదనంగా టికెట్లు(Tickets) విక్రయించడంతో, విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు పాపికొండలు చూడకుండానే వెనుతిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పర్యాటకులకు ఎదురైంది. విహారయాత్రికులు భద్రాచలం (Bhadrachalam) నుంచి పాపికొండలు బోటు పాయింట్ పోచారం వరకు వెళ్లగా, అక్కడ బోట్లు సరిపడా లేకపోవడంతో మధ్యాహ్నం వరకు నిరీక్షించారు. ఎంతసేపటికి బోట్లు రాకపోవడంతో విహారయాత్రకు వెళ్లకుండానే వెనుతిరిగి భద్రాచలం రావాల్సిన పరిస్థితి వచ్చింది.
No Boats after Booked Ticket for Papikondalu Tour : ఏజెంట్లు బోట్ల స్థాయికి మించి టికెట్లు విక్రయించడం వల్లే తాము వెను తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొందని పర్యాటకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏజెంట్ల కౌంటర్ వద్ద ఆందోళన చేశారు. తమతో పాటు చాలామంది పర్యాటకులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, బోటులో ఎక్కించుకోకుండా వెనక్కి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. వేల రూపాయలు వెచ్చించి విహారయాత్రకు వస్తే, పాపికొండలు బోటు పాయింట్ పోచారం వరకు తీసుకెళ్లి బోట్లు ఖాళీ లేవు అనడంతో నిరాశకు గురయ్యామని వాపోయారు. దీనిపై తెలంగాణ బోట్ టూరిజం శాఖ (Telangana Boat Tourism) దృష్టి సారించి, ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పర్యాటకులు కోరారు.
పాపికొండల విహారయాత్ర - రద్దీ దృష్ట్యా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని బోట్ టూరిజం సూచన
'పాపికొండలకు వెళ్దామని ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నాం. వచ్చిన తర్వాత వాళ్లు సగం డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారు. అక్కడికి వెళ్లిన తర్వాత నిర్వాహకులు బోట్లు లేవని, టికెట్లు తీసుకోం అని అన్నారు. ఏంటని వాళ్లను ప్రశ్నిస్తే కనీసం పట్టించుకోలేదు. చాలాసేపు వెయిట్ చేసి చిన్నపిల్లలు, షుగర్ పేషెంట్లు ఉన్నారని మేమే వెనక్కి వచ్చాం. టికెట్కు రూ. 1400 అడ్వాన్స్ తీసుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత రూ. 3600 పే చేయమన్నారు. సరే అని మేము వెళ్లాం. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఇలా జరిగింది. అక్కడే ఓ బోటు ఖాళీగా ఉంది, కానీ అది ఓ సంస్థ బుక్ చేసుకుందని మమ్మల్ని వెళ్లనీయలేదు. కానీ బోటు బుక్ చేసుకున్నా కంపెనీ వాళ్లు ఆ బోటులో కాకుండా వేరే బోటులో వెళ్లారు' - పర్యాటకురాలు
మెదక్లో అందమైన అరణ్యం - వీకెండ్స్కి మంచి టూరిస్ట్ స్పాట్
రామమందిరంతోపాటు అయోధ్యలో ముఖ్య ఆలయాలివే- తప్పక దర్శించుకోండి!