ETV Bharat / state

ఉత్తరాంధ్రలో మంత్రులు గెలవడం కష్టమే - పోటీని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి - tough situation for ministers

Tough Situation for Uttarandhra Ministers: వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో మంత్రులు కూడా గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో ధర్మాన, బొత్స, అమర్‌నాథ్‌ ఎదురీదుతున్నారు. మరో మంత్రి సీదిరి అప్పలరాజు సైతం హోరాహోరీగా పోరాడుతున్నారు. అదే విధంగా సభాపతి తమ్మినేని సీతారాం ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా డబ్బులు పంచి, గట్టెక్కేస్తామనే ధీమాతో ఉన్నారు.

tough to ministers
tough to ministers
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 10:04 AM IST

Tough Situation for Uttarandhra Ministers: జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక పవనాల ఉద్ధృతి క్రమేణా పెరుగుతుండటంతో ఉత్తరాంధ్రలో మంత్రులు సైతం గెలిచేందుకు ఎదురీదుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నేతలు, వారి బంధువర్గం, అనుచరగణం చేసిన అవినీతి అక్రమాలు వారిని వెంటాడుతున్నాయి. పైగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏమీ లేవు. ప్రజలను మెప్పించే స్థాయి పనలూ ఏమీ చేయలేదు. అయిదు సంవత్సరాల చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం?

నియోజకవర్గంలో సమస్తం ప్రజలను పీడించిన రాజ్యాధికారం అని ప్రతి ఊరూ ఘోషిస్తోంది. కేవలం డబ్బులు పంచి, చివరి మూడు, నాలుగు రోజులు కొనుగోళ్ల పర్వం సాగించి బయటపడాలని మంత్రులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ప్రజావ్యతిరేక పవనాల్లో ఆ ప్రయత్నాలు ఫలించడమూ ప్రశ్నార్థకంగానే ఉంది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌లు గెలిచేందుకు ఎదురీదుతున్నారు. మరో మంత్రి సీదిరి అప్పలరాజు హోరాహోరీ పోరాడుతున్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోవడంతో వీరా అమాత్యులు? ఇలాంటివారా నాయకులు అంటూ ఉత్తరాంధ్ర ప్రజానీకం నిలదీస్తోంది.

రాజంపేట బరిలో మాజీ సీఎం - అన్న ఎంపీ, తమ్ముడు ఎమ్మెల్యే! - Rajampet LOK SABHA ELECTIONS

‘ధర్మా’న గెలవడం కష్టమే!: సీనియర్‌ నేత, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల బరిలో ఆపసోపాలు పడుతున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని రెండున్నర సంవత్సరాలు బయటకే రాలేదు. కరోనా సమయంలోనూ ప్రజల్ని పట్టించుకోలేదు. రెండో దఫాలో మంత్రి పదవి దక్కిన తర్వాతే అడుగు బయటపెట్టారు. మంత్రి పదవి లేకపోతే ప్రజలు కనిపించరా అంటూ శ్రీకాకుళం ప్రజలు నిలదీస్తుండటం ఈ ఎన్నికల్లో ధర్మానకు సమస్యగా మారింది. శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న 2.14 ఎకరాల భూమి ఆక్రమణల వ్యవహారం మరో ముఖ్యమైన అంశం. శ్రీకాకుళం, ఆమదాలవలస మధ్య 15 కి.మీ. రోడ్డు నిర్మాణం అయిదు సంవత్సరాలలో పూర్తి చేయకపోవడం, ఈ రహదారిపై వరుస ప్రమాదాలు జరిగి ఏకంగా 24 మంది మరణించిన ఘటనలు ధర్మాన ప్రసాదరావుకు పెద్ద మైనస్‌. స్టేడియం, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణం పూర్తి చేయలేదు. ఇవన్నీ ఎన్నికల సమయంలో ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

Uttarandhra Ministers
Uttarandhra Ministers

టీడీపీ నుంచి యువకుడైన గొండు శంకర్‌ను బరిలో నిలిపారు. ఆయన రెండు సంవత్సరాలుగా అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. ఆయన కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. చివరి నిమిషంలో లక్ష్మీదేవికి అభ్యర్థిత్వం నిరాకరించిన టీడీపీ శంకర్‌ను బరిలో నిలిపింది. లక్ష్మీదేవి ఈ ఎన్నికల్లో నిశ్శబ్దంగా ఉండిపోతుండటంతో ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ధర్మాన వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్మీదేవి, అప్పలనర్సయ్యలతో మాట్లాడారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ నేత కూన రవికుమార్‌, గొండు శంకర్‌లు కలిసి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌తో సమావేశమయ్యారు. ధర్మాన చివరి మూడు రోజుల ధన మంత్రాంగంతో పై చేయి సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత, ధర్మానపై ఉన్న అసంతృప్తి ఫలితాన్ని ఎటు వైపు నిలబెడతాయో చూడాలి.

ప్రకృతి అందాలకు నెలవు అమలాపురం - స్పీకర్​ బాలయోగి సేవలు చిరస్మరణీయం - Amalapuram LOK SABHA ELECTIONS

విద్యామంత్రి ఎదురీత: సీనియర్‌ నేత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకూ కష్టకాలమే. చీపురుపల్లి నియోజకవర్గంలో స్థానికులకు అందుబాటులో ఉండరు. ఏదైనా కార్యక్రమం ఉంటే తప్ప ఇక్కడికి రారు. చీపురుపల్లి రాజకీయం అంతా ఆయన మేనల్లుడు, విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేతిలోనే ఉంది. చిన్న శ్రీను వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలున్నాయి. నియోజకవర్గంలో భూఆక్రమణలు ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. అధికార పార్టీ కీలక నేత ఒకరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను బెదిరించి వెంచర్లను ఆక్రమించుకోవడం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టింది. సీనియర్‌ మంత్రిగా బొత్స మార్కు అభివృద్ధి ఎక్కడా కనిపించదు. చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంఘాన్ని ఏపీడీసీఎల్‌లో విలీనం చేయడంపై ప్రజల్లో అసంతృప్తి పెంచింది. మేనల్లుడు మజ్జి శ్రీనివాసుతో కుటుంబంలో వచ్చిన విభేదాలూ కొంత ప్రభావం చూపుతున్నాయంటున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి పెరిగిన వలసలూ బొత్సకు ఇబ్బందికరమే.

Uttarandhra Ministers
Uttarandhra Ministers

తెలుగుదేశం నుంచి కిమిడి కళా వెంకటరావు చీపురుపల్లి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున ఈ నియోజకవర్గంలో అభ్యర్థిత్వం ఆశించారు. వెంకటరావు నామినేషన్‌ రోజు నాగార్జున సైతం హాజరయ్యారు. వీరిద్దరూ జట్టుగా కదిలితే ఎదురులేదన్న అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది. బొత్స, వెంకటరావులిద్దరిదీ ఒకే సామాజికవర్గం. గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాలు ఇక్కడ కీలకం. కిందటి ఎన్నికల్లో బొత్స గెలుపునకు ప్రధాన పాత్ర పోషించిన మెరకముడిదాం మండలంలో ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎదురీదాల్సి రావడం ఆయనకు ప్రతికూలాంశం. జనసేన టీడీపీకి మద్దతివ్వడంతో కొన్ని వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరుగుతోంది. చివరి 10 రోజులు బొత్స డబ్బుతో చేసే రాజకీయమే కీలకమని స్థానికులే చెబుతున్నారు. ప్రలోభపెట్టి అన్ని పార్టీల్లోనూ మద్దతుదారులను తయారుచేసుకుంటారని, రాత్రికి రాత్రే ఓట్లు కొనేస్తారన్నది వారి గతానుభవం.

గుంటూరు గడ్డ టీడీపీ అడ్డా - నేటికీ అడుగుపెట్టని వైఎస్సార్సీపీ - Guntur LOK SABHA ELECTIONS

ప్రజావ్యతిరేకతతో సభాపతి ఉక్కిరిబిక్కిరి: శాసనసభాపతి తమ్మినేని సీతారాం ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ‘పెట్రోలు బంకు ఏర్పాటు చేసుకున్నారు. ఇల్లు కట్టుకున్నారు. కాలేజీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలకు రోడ్డు మాత్రం వేయలేకపోయారని ఆమదాలవలస పట్టణంలోని ఒక మెడికల్ షాపు యజమాని నిలదీశారు. మరోసారి ఆయనను ఎన్నుకునేది లేదని తెగేసి చెప్పారు. ‘ఆయన దగ్గరికి వెళ్లాలంటే ఆ కుటుంబంలో అందరినీ సంతోషపరచాలి. ఏ పనీ చేయరు వాళ్లు’’ అని మరో దుకాణ యజమాని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవర్ని కదిపినా సీతారామ్‌పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

Uttarandhra Ministers
Uttarandhra Ministers

ప్రధానంగా శ్రీకాకుళం- ఆమదాలవలస రోడ్డు పూర్తి చేయకపోవడం ఈ ఎన్నికల్లో తమ్మినేనిపై చాలా ప్రభావం చూపబోతోంది. ఈ నియోజకవర్గంలో ఎందరో ఆ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో చనిపోయారు. వందల మంది క్షతగాత్రులయ్యారు. నియోజకవర్గంలో భూముల సెటిల్‌మెంట్లు కీలకాంశమయింది. సభాపతి కుటుంబసభ్యుల తీరుతెన్నులు వివాదాస్పదంగా మారాయి. నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీలో కీలక వ్యక్తులు ఉద్యోగుల నుంచి బదిలీలకు, పోస్టింగులకు చేసిన వసూళ్ల ప్రభావం అధికార పార్టీకి ప్రతికూలమవుతోంది. వైఎస్సార్సీపీ నాయకుడు గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన ఎంతో కొంత ఓట్లు చీల్చనున్నారు.

టీడీపీ నుంచి కూన రవికుమార్‌ మరోసారి బరిలో నిలిచారు. సభాపతిపై ప్రజావ్యతిరేకత, జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. నాలుగు మండలాల నుంచి అనేక మంది వైఎస్సార్సీపీ నాయకులు పార్టీలోకి వస్తుండటం సైకిల్‌ పార్టీలో జోష్‌ పెంచుతోంది. టీడీపీ క్యాడర్‌ మండలాల వారీగా ఎన్నికల ప్రణాళికతో ముందుకెళుతోంది.

సూపర్​ స్టార్​ను గెలిపించి ఓడించిన ఏలూరు - నేడు ఉత్కంఠ రేపుతున్న పోరు - ELURU LOK SABHA ELECTIONS

సొంత నియోజకవర్గమే వద్దంటోంది!: అనకాపల్లిలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడంతో మంత్రి అమర్‌నాథ్‌ను మరోసారి అక్కడ పోటీకి నిలిపేందుకు జగన్‌ మోహన్ రెడ్డికి సైతం ధైర్యం చాల్లేదు. అసలు ఈ ఎన్నికల్లో అభ్యర్థిత్వం దక్కుతుందా లేదా అన్న చర్చ నుంచి చివరికి గాజువాక నుంచి బరిలో నిలిపారు. ఆయన సొంతూరు మింది ఇక్కడే ఉంది. రాష్ట్రానికి మంత్రి అయినా అయిదు సంవత్సరాలుగా స్వగ్రామంలోని ప్రజలను ఆయన పట్టించుకోలేదు. ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఇప్పుడు ‘నన్ను నమ్మండి’ అంటూ సొంత నియోజకవర్గ ఓటర్లను బతిమాలుకోవాల్సిన దుస్థితి వచ్చింది. స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనకు సంఘీభావం ప్రకటించకపోవడంతో ఆ ఉద్యోగుల కుటుంబాలన్నీ గుడివాడ అమర్‌నాథ్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో లక్షకు పైగా ఉన్న వలస ఓటర్లను ఏదోలా మచ్చిక చేసుకోవాలని అమర్‌నాథ్‌ వ్యూహాలు రచిస్తున్నారు. కులసంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు సమీకరణకు అమర్​నాథ్ తీవ్రంగా పాట్లు పడుతున్నారు.

Uttarandhra Ministers
Uttarandhra Ministers

టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పల్లా శ్రీనివాసరావు ఎప్పుడూ ప్రజలతోనే ఉండటం కలిసొచ్చే అంశం. స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఏడు రోజులపాటు నిరసన దీక్ష చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2014 నుంచి 2019 వరకు గాజువాక నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన కృషి కలిసివస్తోంది. అప్పట్లో జీవో 301 తీసుకువచ్చి 7 వేల 800 మందికి పట్టాలు ఇప్పించారు. పేదల భూ సమస్యను పరిష్కరించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవో రద్దు చేసి కొన్నాళ్లు ఇబ్బంది పెట్టడమూ ఓటర్లలో ఆగ్రహానికి కారణమవుతోంది. పల్లా శ్రీనివాసరావు స్టీల్‌ ప్లాంట్‌కు భూములిచ్చిన వారికి పునరావాస కార్డులు, కొందరికి శాశ్వత ఉద్యోగాలు, చాలామందికి ఒప్పంద ఉద్యోగాలు ఇప్పించారనే సానుభూతి కూడా ఉంది.

కొవిడ్‌ సమయంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. వయసులో పెద్దవాడైన ఆయన రెండున్నర సంవత్సరాలు బయటికి రాలేదు. తర్వాత ఆయన కుమారులు నియోజకవర్గ బాధ్యతలు చూసినా అక్కడ సమస్యలు మాత్రం వారు పరిష్కరించలేదు. ఈ ప్రభావమూ అమర్‌నాథ్‌కు కష్టాలు తెచ్చి పెడుతోంది. సామాజిక సమీకరణాలతో బయటపడాలని అమర్​నాథ్ ప్రయత్నిస్తున్నా అవీ కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. తన వర్గాన్ని ఆయన హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అనకాపల్లిలో సొంత వర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శ గాజువాక దాకా పాకింది.

పౌరుషానికి ప్రతీక పల్నాడు గడ్డ - నర్సరావుపేట ఎవరి అడ్డా? - Narasaraopet LOK SABHA ELECTIONS

పశుసంవర్థకశాఖ మంత్రికి హోరాహోరీ: పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రస్తుత ఎన్నికలు పెనుసవాల్‌గా మారాయి. తెలుగుదేశం నుంచి గౌతు శిరీష పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీలో ఉన్నారు. పలాస నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ నాయకుల అరాచకాలు ఇక్కడ అప్పలరాజుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ నలుగురు నేతలే ముఖ్యమయ్యారు. వారు చేసిన అక్రమాలు, అరాచకాల ప్రభావం అధికార పార్టీ గెలుపునకు ప్రతిబంధకమవుతోంది. మంత్రికి అత్యంత సన్నిహిత బంధుత్వమున్న వ్యక్తి వ్యవహారశైలి కూడా వ్యతిరేకతను పోగుచేసింది. ఇక్కడ పోస్టింగులు, బదిలీలు అధికార పార్టీ నేతల సిఫార్సులతో అడ్డగోలుగా జరిగాయి. పేదలకు భూపంపిణీలో అవకతవకలు, కొండలను పిండి చేయడం, పట్టాల వ్యవహారాల్లో అక్రమాలు, భూముల ఆక్రమణల వంటి ఆరోపణలు వైఎస్సార్సీపీ నాయకులు కొందరిపై ఉన్నాయి. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలకు ఎంతో కీలకమైన రైల్వే పైవంతెన నిర్మాణం ఇంత వరకు పూర్తి చేయకపోవడం ప్రతికూల ప్రభావం చూపబోతోంది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనలేదు. ఆస్పత్రిలో పూర్తి స్థాయి వైద్యులు లేరు. ఉద్దానానికి మంచినీళ్లు అందించే పథకమూ రూపుదాల్చలేదు. ఇవన్నీ అప్పలరాజుకు ప్రతికూలంగా మారుతున్నాయి.

Uttarandhra Ministers
Uttarandhra Ministers

టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష పార్టీ నాయకులను అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల రంగంలో వారం రోజులుగా తన శైలి మార్చుకుని క్యాడర్‌ మద్దతు పెంచుకుని, ప్రజా మద్దతు పొందేందుకు గౌతు శిరీష అడుగులు వేస్తున్నారు. జనసేనకు కిందటి ఎన్నికల్లో చెప్పదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి. మూడు పార్టీల కూటమిగా ఏర్పడటమూ శిరీషకు కలిసొచ్చే అంశం. ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉండబోతోంది.

అంతుచిక్కని సింహపురి రాజకీయం - ఎవరిని వరించేనో విజయం - Nellore LOK SABHA ELECTIONS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.