ETV Bharat / state

కొండెక్కి రూ.100పై కూర్చున్న టమాట - నూనెలు, పప్పు దినుసులతో సై అంటే సై! - Tomato Price Hike In Telangana - TOMATO PRICE HIKE IN TELANGANA

కొండెక్కిన టమాట ధరలు - హోల్​సేల్​ మార్కెట్​లో కిలో 80, రిటైల్​లో రూ.100 - వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో అమాంతం పెరిగిన రేట్లు

Tomato Price Hike In Telangana
Tomato Price Hike In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 8:52 AM IST

Updated : Oct 5, 2024, 9:03 AM IST

Tomato Price Hike In Telangana : టమాట ధర మళ్లీ ఒక్కసారిగా కొండెక్కింది. రెండు రోజుల క్రితం వరకు కిలో రూ.80 పలకగా శుక్రవారం రూ.100కు చేరింది. ఇరవై రోజుల క్రితం కిలో టమాట రూ.30 నుంచి రూ.40 పలకగా, ఐదు రోజుల క్రితం వరకూ రూ.60 చొప్పున అమ్మకాలు చేశారు. ప్రస్తుతం హోల్​సేల్​ వ్యాపారులు కిలో టమాట రూ.80కి విక్రయిస్తుంటే, రిటైల్ వ్యాపారులు రూ.100కు విక్రయిస్తున్నారు. డిమాండ్​కు సరిపడా దిగుబడులు లేకపోవడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు భావిస్తున్నారు. ప్రతి ఏటా ధరల హెచ్చు తగ్గుదలతో టమాట తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపకపోవడంతో పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

వరదల కారణంగా ఒక్కసారిగా పెరిగిన ధరలు : నాలుగైదు నెలల క్రితం మెదక్, నిజామాబాద్‌ జిల్లాల నుంచి టమాట దిగుమతి చేసుకున్నారు. అయితే ఇటీవల వర్షాల వల్ల తోటలు దెబ్బ తినడంతో ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కల్యాణదుర్గం, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే టమాట పరిస్థితీ అంతే. ఇటీవల వరదలకు అక్కడి తోటలూ దెబ్బ తినడంతో అక్కడి హోల్‌సేల్‌ వ్యాపారులు ధరను ఒక్కసారిగా పెంచేశారు. ఏపీలో 22 కిలోల బాక్స్‌కు రూ.1,550 (కిలో రూ.70) చొప్పున అమ్ముతుండగా, రవాణా, ఇతర ఖర్చులతో కలిపి ఇక్కడి మార్కెట్‌లో హోల్‌సేల్‌గా రూ.80కు అమ్ముతున్నట్లు వ్యాపారులు అంటున్నారు. అదే రిటైల్‌ వ్యాపారులు మరో రూ.20 పెంచేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. మొత్తంగా 20 రోజుల క్రితం రూ.30 నుంచి రూ.40 పలికిన టమాట ధరలు, ప్రస్తుతం కొండెక్కి రూ.100పై కూర్చున్నాయి.

నూనెలు కొనలేం! - పప్పులు తినలేం!! - పండుగల వేళ వంటింట్లో 'ధర'ల మంట - Essentials Price Increased

పైపైకి నిత్యావసరాల ధరలు : వేతన జీవులు నెల జీతాన్ని ప్రణాళికతో వెచ్చిస్తుంటారు. పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు పక్కాగా ప్రణాళిక వేసుకుంటారు. కొన్నాళ్లుగా పెరుగుతున్న నిత్యవసరాల ధరలతో వేతన జీవులు లోటు బడ్జెట్‌ను ఎదుర్కొంటున్నారు. సిద్దిపేటకు చెందిన నరేశ్‌ చిరుద్యోగి. చాలీచాలని వేతనంతో ఆరుగురి కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. ప్రతి నెలా ఖర్చులకు ప్రణాళికతో వెచ్చిస్తుంటాడు. కొన్నాళ్లుగా పెరిగిన ధరలతో లోటు బడ్జెట్‌ ఎదుర్కొంటున్నాడు. నిత్యావసర ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రతి నెలా రూ.3 వేలు ఖర్చు చేయగా, కొన్నాళ్లుగా ఆ లెక్క రూ.4,500కు పెరిగింది.

వంటకాల్లో ఎండు కొబ్బరి రుచిని పెంచుతుంది. పోషకాలను, చిక్కదనాన్ని అందిస్తుంది. పది రోజుల్లో దీని ధర అమాంతం పెరిగింది. ఆరు నెలల్లో పప్పుల ధరలు సైతం పెరిగాయి. మరోవైపు కేజీ నువ్వులు రూ.180కు చేరింది. చక్కెర రూ.41, రవ్వ- రూ.42, గోధుమపిండి రూ.40 పలుకుతోంది. గతంతో పోలిస్తే రూ.5 పెరిగినట్లు స్పష్టమవుతోంది. కూరగాయల ధరలూ మండుతున్నాయి.

బియ్యం కుతకుత, నూనెలు సలసల - పండుగ వేళ నిత్యావసరాల మంట - Essential Commodities Prices Hikes

increased cooking oil prices: కొనకుండానే సలసల కాగుతున్న వంట నూనెలు

Last Updated : Oct 5, 2024, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.