Road Accident in Nellore Three Died Two Injured : నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఓవర్ టెక్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీ కొట్టడంతో కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. చెన్నైలో బంగారం కొనుక్కొని, తిరిగి కొయ్యల గూడెంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణి , రాజి , కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.
Car Accident in National Highway Krishna District : కృష్ణా జిల్లా బంటుమిల్లి వద్ద 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి నరసాపురం వెళుతున్న కారు మునిపెడ హరిజనవాడ గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- ట్రాలీ ఢీకొని 9మంది మృతి - Road Accident In Rajasthan
Road Accidents today Andhra Pradesh : లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుంచి శ్రీకాకుళం వస్తున్న వ్యాను అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది. ప్రమాదంలో వ్యానులో ఉన్న ఐదుగురు మహిళలు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయనగరానికి చెందిన స్వర్ణలత, భ్రమరాంబ, పద్మావతి, గజలక్ష్మి వీరంతా ఎచ్చెర్లలోని అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయునిలుగా పని చేస్తున్నారు. సాయి పల్లవి శ్రీకాకుళంలో ఉన్న ఓ ప్రైవేటు దంత వైద్య కళాశాలలో చదువుతుంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు వ్యాను ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో స్థానికులు వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని శ్రీకాకుళం సర్వజన, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై లావేరు ఎస్‌ఐ స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు మృతి - FIVE PEOPLE DIED IN ROAD ACCIDENT
ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సు-బైక్ ఢీ - ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు - TODAY ACCIDENTS IN AP